Site icon NTV Telugu

Anna University Case: అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచార కేసులో సంచలన తీర్పు..

Anna University Case

Anna University Case

Anna University Case: తమిళనాడులో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. స్థానికంగా బిర్యానీ విక్రేత అయిన నిందితుడు జ్ఞానశేఖరన్‌కు జీవిత ఖైదు విధించబడింది. విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడినందుకు చెన్నైలోని మహిళా కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేసింది. జీవిత ఖైదుతో పాటు రూ. 90,000 జరిమానా విధించింది. దోషి కనీసం 30 సంవత్సరాలు జైలులో ఉండాలి అని న్యాయమూర్తి ఎం. రాజలక్ష్మి అన్నారు.

నిందితుడు తన తల్లి, మైనర్ కుమార్తెను చూసుకోవాల్సి ఉందని గతంలో నిందితుడు కోర్టును శిక్ష తగ్గించాలని కోరాడు. ఐదు నెలల విచారణ తర్వాత నిందితుడికి శిక్ష పడింది. లైంగిక దాడి, అత్యాచారం, బెదిరింపు మరియు కిడ్నాప్‌తో సహా మొత్తం 11 ఆరోపణలపై జ్ఞానశేఖరన్‌ను న్యాయమూర్తి గత వారం దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో కనీసం 29 మంది సాక్షులు సాక్ష్యం చెప్పారు. పోలీసులు 100 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.

Read Also: Shiva Rajkumar : శివరాజ్ కుమార్ మెడకు చుట్టుకున్న.. కమల్ వివాదం

కేసు వివరాలు:

తమిళనాడులో ఈ కేసు సంచలనంగా మారింది. గతేడాది డిసెంబర్ లో జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ సంచలనంగా మారింది. నిందితుడు అధికార డీఎంకే పార్టీకి చెందిన కార్యకర్త కావడంతో ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. కేసును మద్రాస్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో, అతడిని కొట్టి విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. బాధిత యువతి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతోంది. డిసెంబర్ 23న, జ్ఞానశేఖరన్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, ఆ యువకుడి స్నేహితుడిపై దాడి చేసి, ఆపై ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతో అతను ఆ చర్యను వీడియో కూడా తీసుకున్నాడు. అదే రోజు అతన్ని అరెస్టు చేశారు.

Exit mobile version