NTV Telugu Site icon

DK Shivakumar: బీజేపీ వాళ్లు కాంగ్రెస్తో టచ్‌లో ఉన్నారు..

Dk

Dk

DK Shivakumar: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ముందు కమలం పార్టీ తన ఇంటిని చక్కదిద్దుకోనివ్వండి.. ఆ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మా పార్టీ మంత్రులే స్వయంగా తెలిపారు.. దీనిపై ఎలాంటి చర్చలు అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, సద్గురు జగ్గీ వాసుదేవ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలవడంపై వస్తున్న విమర్శలపై కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైంది, రాజకీయం కాదని వెల్లడించారు. సద్గురు మన రాష్ట్రానికి చెందిన వారు.. ఆయన కావేరీ జలాల కోసం పోరాటం చేస్తున్నారు.. ఆయనే స్వయంగా వచ్చి ఆహ్వానించడంతోనే నేను ఆ కార్యక్రమానికి వెళ్లాను అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు.

Read Also: Ganja Smuggling: రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్లు.. కానిస్టేబుల్‌ను ఢీ కొట్టి?

కాగా, మహాశివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, డీకే శివకుమార్‌ పాల్గొన్నారు. దీంతో కమలం పార్టీకి డీకే దగ్గరవుతున్నారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలు కాంగ్రెస్‌ వర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ పరిణామాలపై బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత ఆర్‌ అశోకా రియాక్ట్ అవుతూ.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందేతో డీకే శివకుమార్‌ను సైతం పోల్చారు. ఇక, డీకే పార్టీ మారతారని వస్తున్న ప్రచారాన్ని కేపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర తోసిపుచ్చారు.