NTV Telugu Site icon

Leopard : జనారణ్యంలో వన్య మృగాలు.. బెడ్రూంలో చిరుతపులి

Untitled 3

Untitled 3

Nashik: ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అంటే మనుషులు ఊర్లలో ఉండాలి.. వన్య ప్రాణులు అడవుల్లో ఉండాలి. కానీ మనిషి తన స్వార్ధం కోసం అడవులను నాశనం చేస్తున్నారు. పరిధి దాటి అడవుల లోకి ప్రవేశిస్తున్నాడు. అందుకే అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు అడవి ధాటి జనావాసాల లోకి వస్తున్నాయి. ఇలా చిరుతలు గత కొంత కాలంగా జనారణ్యంలో సంచరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర లోను ఈ పరిస్థితి నెలకొంది. వివరాలలోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని నాసిక్ ప్రాంతంలో చిరుత పులులు కలకలం సృష్టిస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో మహారాష్ట్ర లోని నాసిక్ ప్రాంతంలో రెండు చిరుతలు జనావాసాల్లోకి రావడం కలకలం రేపింది.

Read also:Pat Cummins: ఆడు మగాడ్రా బుజ్జి.. అన్నంత పని చేశాడు!

నాసిక్‌ లోని ఓ భవనము మొదటి అంతస్తు లోని ఇంటి తలుపులు తెరచి ఉండడంతో ఓ చిరుతపులి సరాసరి బెడ్‌రూమ్‌ లోకి చొరబడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా.. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం అధికారులు ట్రాంక్విలైజర్‌తో చిరుతపులిని కాల్చారు. దేనితో ఆ చిరుత స్పృహ తప్పింది. ఆ తరువాత అటవీశాఖ సిబ్బంది ఆ పులిని మెట్లపై నుంచి కిందకు తీసుకువచ్చారు. అలా సిబ్బంది పులి తీసుకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. కాగా ఇటీవల మహారాష్ట్ర లోని టాటా పవర్ కాంప్లెక్స్‌లో చిరుతపులి సాంచారం కలకలం రేపింది. అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రాత్రి వేళల్లో సోదాలు నిర్వహించగా అప్పటికే చిరుత పులి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు.