Site icon NTV Telugu

Tamil Nadu: పోలీస్‌స్టేషన్‌కు స్పెషల్ గెస్ట్.. కలియ తిరిగి ఏం చేసిందంటే..!

Leopard

Leopard

తమిళనాడులోని ఓ పోలీస్ స్టేషన్‌కు విశిష్ట అతిథి వచ్చింది. ఏ వీఐపీనో… సెలబ్రిటీనో కాదు. ఎన్నడూ పోలీస్ వాళ్లు కూడా చూడని అతిథి రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు కూడా పేలుతున్నాయి. అసలు ఆ అతిథి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా గూడలూరు-ఊటీ జాతీయ రాహదారిపై ఉన్న పోలీస్ స్టేషన్. సోమవారం రాత్రి 8:30 గంటల సమయం. ఉన్నట్టుండి.. ఒక చిరుత పులి మెయిన్ డోర్‌ నుంచి లోపలికి వచ్చింది. గదిలో కాసేపు కలియ తిరిగింది. ఎవరూ కనిపించలేదు. పైగా భోజనం కూడా దొరకలేదు. ఇక చేసేదేమీలేక.. వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఇక చిరుత పులి లోపలికి వచ్చినప్పుడు.. పక్క గదిలోనే ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. చిరుత లోపలికి రావడం చూసి కిమ్మనకుండా మౌనంగా ఉన్నాడు. అది బయటకు వెళ్లిపోగానే తలుపు మూసేసి.. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: Canada: విషాదం.. భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి

చిరుత పులి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సెటైర్లు పేలుతున్నాయి. ప్రియురాలు మిస్ అయిందంటూ చిరుత కంప్లంట్ ఇచ్చేందుకు వచ్చిందంటూ కామెంట్ చేశారు. మనుషులు వచ్చినా.. జంతువులు వచ్చినా పోలీసు వాళ్లు పట్టించుకోరంటూ ఇంకొందరు కామెంట్లు చేశారు. కంప్లంట్ చేసేందుకు వస్తే.. ఎవరూ లేరంటూ ఆవేదనతో చిరుత వెనక్కి వెళ్లిపోయిందంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇలా నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు.

వాస్తవంగా వేసవి కాలంలో అడవుల్లో నీళ్లు దొరకవు. అలాగే ఆహారం కూడా లభించదు. దీంతో అడవి మృగాలు.. ఆహారం కోసం జనావాసాల మధ్యకు వచ్చేస్తుంటాయి. ఆ విధంగానే చిరుత వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇక చిరుత సమాచారాన్ని పోలీసులు.. ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. రంగంలోకి దిగిన అధికారులు.. చిరుత కోసం జల్లెడ పడుతున్నారు.

ఇది కూడా చదవండి: AakankshaSingh : హాట్ ఫోజులతో కాంక్ష రేపుతున్న ఆకాంక్షసింగ్

Exit mobile version