NTV Telugu Site icon

Mamata Banerjee: కోల్‌కతా హాస్పిటల్ దాడి బీజేపీ, లెఫ్ట్ పార్టీల పనే..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం-హత్య ఘటన ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపలనకు కారణమైంది. మమతా బెనర్జీ సర్కారుపై బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విరుచుకుపడుతున్నాయి. గత వారం కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ మహిళా డాక్టర్‌పై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై సంజయ్ రాయ్ అనే వ్యక్తిని దారుణానికి ఒడిగట్టానే ఆరోపణల్ని ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా వైద్యులు రోడ్డెక్కారు. బాధితురాలికి మద్దతుగా ధర్నాలు, నిరసనలు తెలిపారు. ఇప్పటికే ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

ఇదిలా ఉంటే, గురువారం వైద్యులు నిరసన తెలుపుతున్న సందర్భంలో కొందరు దుండగులు ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిపై దాడి చేశారు. ఈ ఘటనలో సీపీఎం, బీజేపీ దాని మిత్రపక్షాల ప్రమేయం ఉందని సీఎం మమతా బెనర్జీ ఈ రోజు అన్నారు. ఈ రోజు బాధిత వైద్యురాలికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని ఉరితీయాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచారం, హత్య వెనక ఉన్న నిజాన్ని మరుగునపరిచేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

Read Also: Satyakumar: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ..

నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ నిజాన్ని దాచి పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ చర్యల్ని ఖండిస్తున్నామని, దోషుల్ని ఖఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి విధ్వంసం వెనక బీజేపీ, సీపీఎంలు ఉన్నాయని, సాక్ష్యాలు ధ్వంసం చేయడానికి ఆస్పత్రిపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. బెంగాల్‌లో అశాంతి సృష్టించేందుకు రెండు పార్టీలు ఒకటయ్యాయని విమర్శించారు. చాలా వీడియోల్లో సీపీఎం, బీజేపీ జెండాలు ఉన్నాయని చెప్పారు.

ఇదిలా ఉంటే, మమతా బెనర్జీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఆర్జీ కర్ ఆస్పత్రి దాడి వెనక టీఎంసీ గుండాలు ఉన్నారని, పోలీసులు వారికి సురక్షితమైన మార్గాన్ని అందించి పారిపోయాలా చేశారని బీజేపీ నేత సువేందు అధికారి ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఈ విధ్వంసానికి పాల్పడిన వారిలో 25 మంది పోలీసులు అరెస్ట్ చేశారు.