కోవిడ్ ఎఫెక్ట్… ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది.. క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షల బాట పట్టాయి.. ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం లేకుండా.. ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది ఢిల్లీ సర్కార్.. కోవిడ్‌పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతోన్న తరుణంలో అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. మరోవైపు, జమ్ములోనూ ఇలాంటి పరిస్థితే వచ్చింది.. అక్కడ వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: జనవరి 6, గురువారం దినఫలాలు…
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
అన్ని విభాగాల్లోని అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేయడమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులు అంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం… అత్యసరమైతే తప్ప సెలవులు పెట్టొద్దని స్పష్టం చేసింది.. దేశ రాజధానిలోని ఒకే రోజు కోవిడ్‌పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు కావడం, పాజిటివిటీ రేటు ఏకంగా 11.88కి చేరిన నేపథ్యంలో తగినంత సిబ్బంది అవసరమని భావిస్తున్న ప్రభుత్వం.. అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు విధులకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని పేర్కొంది. కోవిడ్ నియంత్రణ చర్యల కోసం ప్రభుత్వ రంగంలోని వివిధ విభాగాల్లో పలు స్థాయిల్లో సిబ్బంది భారీగా అవసరం. అందువల్ల అత్యవసరమైతే తప్ప అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని.. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇవి అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది ఢిల్లీ ప్రభుత్వం.. కాగా, కరోనా కట్టడి కోసం నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్డౌన్ లాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నా.. క్రమంగా కేసులు పెరిగిపోతూ ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్‌లో భారత్‌తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్‌కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్‌తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్‌కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!