Layoffs 2025: ఉద్యోగాలకు ఎసరుపెడుతున్న AI.. 2025లో భారీగా టెక్ లేఆఫ్స్..
- ఉద్యోగాలకు ఎసరుపెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..
- 2025లో భారీగా లేఆఫ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Layoffs 2025: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం టెక్ ప్రపంచంలో “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)” మాటే వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించే దిశగా ఏఐ అడుగులు వేస్తోంది. అయితే, ఇప్పుడు ఏఐ అభివృద్ధి ఉద్యోగులకు చేటు చేయబోతోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా టెక్, ఇతర ఇండస్ట్రీల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. 2025లో భారీ సంఖ్యలో టెక్ లేఆఫ్స్ ఉండబోతున్నాయి.
ఇప్పటికే, అన్ని అగ్రగామి టెక్ సంస్థలైన మెటా, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, బీపీ వంటి కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్ నుంచి ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించాయి. ఇవే కాకుండా చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తీసేయబోతున్నాయి. ఎక్కువగా కంపెనీలు తమ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల వైపు వెళ్లడానికి, ఖర్చుల్ని తగ్గించుకోవాలని ఉద్యోగుల్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాయి.
Also Read
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
- Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
Read Also: Maharashtra: సీఎం ఫడ్నవీస్ మీటింగ్‌కి ఏక్నాథ్ షిండే మళ్లీ గైర్హాజరు.. ప్రభుత్వంలో విబేధాలు..?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్ 2025’ సర్వే ప్రకారం, పరిశ్రమల్లో ప్రధాన మార్పులు టెక్నాలజీ మార్పులు, జనాభా మార్పులు, భౌగోళిక-ఆర్థిక విచ్ఛిన్నం. AI టెక్నాలజీ పెరుగుదల కారణంగా ప్రపంచంలోని దాదాపు 41% కంపెనీలు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో తమ శ్రామిక శక్తిని తగ్గించడంపై దృష్టి పెడతాయని సర్వే సూచించింది.
BI నివేదిక ప్రకారం, CNN, IBM, డ్రాప్‌బాక్స్ ఇప్పటికే ఏఐ కారణంగా ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. ఈ కంపెనీలు మాత్రమే కాకుండా, అనేక ఇతర కంపెనీలు ఖర్చులను ఆదా చేయడానికి మరియు వారి లాభాలను మెరుగుపరచడానికి ఉద్యోగుల్ని నియమించడం కంటే ఆటోమేషన్, AI వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
* డిజిటల్ ఆఫర్‌పై దృష్టిపెట్టడానికి సీఎన్ఎన్ టెలివిజన్‌లో పనిచేస్తున్న 200 మందిని తొలగించింది.
* స్టార్‌బక్స్ మార్చిలో సిబ్బందిని తొలగిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
* ఇంజనీరింగ్, ఉత్పత్తి మరియు కార్యకలాపాలు వంటి విభాగాలలో స్ట్రైప్ 300 మందిని తీసేయనునంది.
*యూకే పెట్రోలియం కంపెనీ బీపీ సుమారుగా 7700 మంది ఉద్యోగుల్ని, కాంట్రాక్టర్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
*మెటా కూడా 5శాతం మంది వర్క్‌ఫోర్స్‌ని తగ్గించనుంది.
*బ్లాక్‌రాక్ 200 మందిని తగ్గిస్తోంది.
*వాషింగ్టన్ పోస్ట్ 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలిపింది.
తాజావార్తలు
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్‌లో జాబ్స్‌కి నోటిఫికేషన్..!
-
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్‌గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!