Kolkata Rape Case: కోల్‌కతా లా విద్యార్థినిపై అత్యాచార ఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా(31)కు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్టూడెంట్ వింగ్‌తో సంబంధం ఉండటం వివాదాన్ని మరింత పెంచింది. ఈ కేసులో ముగ్గురు నిందితులతో పాటు క్యాంపస్ సెక్యూరిటీ గార్డును కూడా అరెస్ట్ చేశారు.
Read Also: CM Chandrababu: మంత్రి నారా లోకేష్‌ని కొనియాడిన సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..?
అయితే, ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన 31 ఏళ్ల వైద్యురాలి కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఆర్జీకర్ ఘటన తర్వాత చెలరేగిన నిరసనల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “రేపిస్టును ఉరితీయాలని కోరుకుంటున్నాను. న్యాయం కావాలి, నాటకం కాదు. తక్షణ న్యాయం కావాలి. దోషులకు మరణశిక్ష కావాలి” అని మిశ్రా పోస్ట్ చేశాడు.
కోల్‌కతా లా విద్యార్థిని అత్యాచారం కేసులో నిందితుడు, గతంలో ఆర్జీకర్ ఘటనలో నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇది మిశ్రా కపటత్వాన్ని సూచిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
