Kiren Rijiju: జడ్జిలది కాదు.. వ్యవస్థదే తప్పు.. పెండింగ్ కేసులపై న్యాయశాఖ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju comments on pending cases: దేశంలో పెరుగుతున్న కేసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది న్యాయమూర్తుల తప్పు కాదని.. వ్యవస్థ తప్పు అని ఆయన అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలను చేస్తోందని అన్నారు. అనవసరమైన, వాడుకలోని చట్టాలను రద్దు చేయడం, కోర్టులో మౌళిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంకేతికను వాడటం వంటివి చేస్తూ మెరుగైన వ్యవస్థ వైపే వెళ్తున్నామని అన్నారు.
ఉదయ్‌పూర్‌లోని మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీలో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఇన్ ఇండియా: ఎవల్యూషన్ అండ్ లీగల్ పెర్స్‌పెక్టివ్’ అనే అంశంపై జరిగిన సదస్సులో శనివారం మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం 4.90 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయని అన్నారు . ఏ దేశంలో లేదా సమాజంలో ఇన్ని కేసులు పెండింగ్‌లో ఉండటం మంచిది కాదని ఆయన అన్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. న్యాయమూర్తుల పరిస్థితి దారుణంగా ఉందని, ఒక న్యాయమూర్తి ఒక్క రోజులో 50-60 కేసులు పరిష్కరిస్తారని, వారు రోజు కేసులు పరిష్కరిస్తుంటారు, అయితే వచ్చే కేసులు రోజు రెట్టింపు సంఖ్యలో ఉంటున్నాయని అన్నారు.
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
Read Also: Earthquake: జపాన్‌లో భూకంపం..
కేసులు పెండింగ్ ఎందుకు ఉంటాయని సామాన్యులు అడుగుతుంటారు, అయితే ఒక న్యాయమూర్తి దీని వెనక ఎంత పనిచేస్తారో ప్రజలకు తెలియదని, ఇది న్యాయమూర్తి తప్పు కాదని, వ్యవస్థ తప్పు అని అన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికి టెక్నాలజీ కీలకం అని, పేపర్ లేస్ గా చేయడానికి దేశవ్యాప్తంగా న్యాయస్థానాలను సాంకేతికతతో సన్నద్ధం చేస్తామని ఆయన అన్నారు. హైకోర్టులు, దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లలో సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నామని.. ఇప్పటికే కొన్ని హైకోర్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ చేపడుతున్నాయని.. ఇది మంచి విషయం అని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థను కాగిత రహితంగా మార్చడము ఇందులో భాగమే అని అన్నారు. ఇది పర్యవరణ పరంగా మేలు చేస్తుందని, గ్రీన్ ఎనర్జీ విషయంలో ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉందని, ప్రధాని మోదీ ముందు చూపే ఇందుకు కారణం అని అన్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!