NTV Telugu Site icon

Jammu Kashmir: ఉగ్రదాడుల వెనక లష్కర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. తలపై రూ. 10 లక్షల నజరానా..

Jk

Jk

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల కాలంలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక లష్కరే తోయిబా, ది రిసిస్టెన్స్ ఫ్రంట్‌కి చెందిన ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా భద్రతా వర్గాలు తెల్చాయి. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని కసూర్ జిల్లాలోని శంగమంగ గ్రామానికి చెందని సైఫుల్లా సాజిద్ జట్ ఈ దాడుల వెనక ఉన్న మాస్టర్ మైండ్‌గా ఎన్ఐఏ తెలిపింది. ఈ ‘హర్డ్ కోర్ టెర్రరిస్ట్’ తలపై రూ.10 లక్షల బహుమతి ఉంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని బేస్ క్యాంప్‌లో జాట్ పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అతని భార్య భారతీయ మూలాలకు చెందిన వ్యక్తి అని, అతనితోనే ఉంటుందని వారు తెలిపారు.

Read Also: J-K: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్లు..ఆరుగురు ఉగ్రవాదుల హతం..

ఇందకుముందు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పనిచేసిన జట్, ప్రస్తుతం లష్కర్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాడు. ఉగ్రవాదులు భారత్‌లోని ప్రవేశించడానికి సాయం చేస్తున్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. సాజిద్ జట్‌ను లష్కర్‌కి ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరిస్తూనే, దాని టెర్రర్ ఫండింగ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. అతనికి జమ్మూ కాశ్మీర్‌లో ఖాసిమ్ అనే వ్యక్తి ఉన్నాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అతని కోసం భద్రతా సంస్థలు వేట సాగిస్తున్నాయి. గత కొన్ని ఏళ్లుగా కాశ్మీర్ లోయలో జరిగే అనేక ఉగ్రఘటనల వెనక జట్ హస్తం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

గత రెండు నెలలుగా జమ్మూ కాశ్మీర్‌లో వరసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. గత నెలలో రియాసిలో యాత్రికుల బస్సుపై అటాక్ జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. ఆ తర్వాత కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. కుల్గాం జిల్లాలో గత రెండు రోజులుగా జరిగి వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగులు ఉగ్రవాదులు హతమయ్యారు.