Site icon NTV Telugu

Tej Pratap Yadav: ఆర్జేడీ నుంచి కొడుకును బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్..

Lalu

Lalu

Tej Pratap Yadav: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ‘‘బాధ్యతా రహితమైన ప్రవర్తన’’, ‘‘కుటుంబ విలువలు’’, ‘‘ప్రజా మర్యాద’’ పాటించడం లేదని ఆరోపిస్తూ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఆర్జేడీలో, బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Read Also: Nimmala Rama Naidu: ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు.. రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు!

శనివారం, ఒక ఫేస్‌బుక్ పోస్టులో తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రియురాలు అనుష్క యాదవ్‌ని పరిచయం చేయడం సంచలనంగా మారింది. తాము 12 ఏళ్లుగా ప్రేమలో, రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ప్రకటించారు. దీని తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు సోషల్ మీడియా పోస్టులో తన పెద్ద కొడుకును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం సామాజిక న్యాయం కోసం పార్టీ సమిష్టి పోరాటాన్ని బలహీనపరుస్తుందని, తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు లేదా సంప్రదాయాలకు అనుగుణంగా లేదని’’ లాలూ అన్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్‌ని పార్టీ నుంచి తొలగించిన తర్వాత, ఇకపై అతనికి పార్టీలో, కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదని లాలూ చెప్పారు.

Exit mobile version