Bihar: కీలకమైన బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ-జేడీయూ కూటమికి, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి కీలక పోరు నెలకొంది. అయితే, ఇప్పుడు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో నెలకొన్న వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల హామీల కన్నా బీహార్ ప్రజలు లాలూ కుటుంబంలో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని కనబరుస్తున్నారు. లాలూ ప్రసాద్ కూతురు రోహిణి ఆచార్య, కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు మరో కొడుకు తేజస్వీ యాదవ్‌తో పొసగడం లేదు. తేజస్వీ యాదవ్ సన్నిహితుడు, రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్ పై వీరిద్దరు విమర్శలు చేస్తున్నారు.
మే నెలలో లాలూ పెద్ద కొడుక తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. దీనికి ముందు తేజ్ ప్రతాప్, సంజయ్‌ను ‘‘జైచంద్’’(ద్రోహి)గా అభివర్ణించాడు.ఇటీవల బీహార్ అధికార్ యాత్ర సమయంలో, తేజస్వీ ప్రచార వాహనంలో ముందు సీటులో సంజయ్ కూర్చుని కనిపించాడు. సాధారణంగా ముందు సీటు అగ్రనాయకత్వానికి కేటాయిస్తారు. సంజయ్ ఆ సీటులో కూర్చున్న ఫోటో వైరల్‌గా మారింది. దీనిపై రోహిణి స్పందిస్తూ..‘సంజయ్ పేరు చెప్పకుండా, కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా “వ్యూహకర్తలు” లాగా కనిపించడం ద్వారా తమను తాము నాయకత్వం కంటే ఎక్కువగా భావిస్తున్నారని చెప్పారు. బీహార్ ప్రజలు అలాంటి యాత్రల సమయంలో తేజస్వి లేదా లాలూను వాహనాల ముందు సీటులో కూర్చోబెట్టడం అలవాటు చేసుకున్నారని కూడా అది పేర్కొంది.
Read Also: Bengaluru: అసలు మీరు మనుషులేనా.. ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని..
ఇది లాలూ కుటుంబంతో తీవ్ర వివాదాన్ని సూచిస్తోంది. పార్టీలో సంజయ్ పాత్ర పెరగడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. “సామాజిక- ఆర్థిక న్యాయం కోసం లాలూ ప్రసాద్ ప్రచార లక్ష్యం అణగారిన వర్గాలను, సమాజంలో అట్టడుగున ఉన్నవారిని ఉద్ధరించడం” అని రోహిణి ట్వీట్ చేసింది. ఇలా వరస ట్వీట్లు ఆ కుటుంబంలో వివాదాలను సూచిస్తున్నాయి. పార్టీలో, కుటుంబలో ఆమెపై వ్యతిరేకత రావడంతో రోహిణి ఆచార్య తన తండ్రి కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసింది. 2022లో లాలూ ప్రసాద్‌కు రోహిణి తన కిడ్నీ ఇచ్చింది. దీనిపై ఆమె ‘‘జీవితాలను పణంగా పెట్టి అతిపెద్ద త్యాగాలు చేసే ధైర్యం ఉన్నవారు తమ రక్తంలో నిర్భయత, నిష్కపటత్వం, ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు’’ అని పేర్కొంది. తాను ఒక కుమార్తెగా, సోదరిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించానని చెప్పింది.
