NTV Telugu Site icon

Lalu Prasad Yadav: పీఎఫ్ఐ లాగే ఆ సంస్థను కూడా నిషేధించాలి.

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav’s demand to ban RSS: రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) కోరలు పీకే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రెండు విడతలుగా ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో దేశంలోని 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీ భారీ ఎత్తున పీఎఫ్ఐపై దాడులు చేసింది. ఈ సంస్థ కీలక వ్యక్తులు, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ విచారణలో విస్తూపోయే నిజాలు బయటకు వస్తుండటంతో పీఎఫ్ఐని బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా పలు సంఘాలు కోరుతున్నాయి. ముస్లిం సంఘాలు కూడా దేశంలో విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్న పీఎఫ్ఐని బ్యాన్ చేయాలని పిలుపునిచ్చాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు పీఎఫ్ఐ సంస్థను నిషేధించింది. దీనిపై పలు రాష్ట్రాల సీఎంలు హర్షం చేశారు. అయితే కొంత మంది మాత్రం పీఎఫ్ఐ పై బ్యాన్ విధించడం ఓకే కానీ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పీఎఫ్ఐ బ్యాన్ ను తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ ను కూడా నిషేధించాలని డిమాండ్ చేశారు.

Read Also: IND Vs SA: పోటాపోటీగా కోహ్లీ, రోహిత్ భారీ కటౌట్‌లు.. ఫోటోలు వైరల్

ఇదిలా ఉంటే కేంద్ర నిర్ణయంపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ విరుచుకుపడ్దారు. పీఎఫ్ఐ లాగే ఆర్ఎస్ఎస్ ని కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ఐ లాగే ఆర్ఎస్ఎస్ కూడా విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని.. అన్నింటి కన్నా ముందు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలని.. ఇది పీఎఫ్ఐ కన్నా ప్రమాదకరమైన సంస్థ అని..గతంలో రెండు సార్లు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసిన సంగతి గుర్తుంచుకోవాలని.. ఆర్ఎస్ఎస్ ను మొదటగా బ్యాన్ చేసింది ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ హిందూ అతివాద సంస్థ అని దాన్ని నిషేధించాల్సి ఉందని అన్నారు.

మరోవైపు పీఎఫ్ఐ బ్యాన్ ను బీజేపీ నేతలు స్వాగతించారు. అజ్మీర్ దర్గా దీవాన్ ప్రభుత్వ చర్యలను స్వాగతించారు. ప్రభుత్వం పీఎఫ్ఐ సంస్థపై 5 ఏళ్లు నిషేధం విధించడంతో ఢిల్లీ షాహీన్ బాగ్ లోని ఆ సంస్థ కార్యాలయం వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.