Site icon NTV Telugu

Tej Pratap Yadav: నా నాశనానికి 5 కుటుంబాలు కుట్రపన్నాయి.. లాలూ కుమారుడు ఆరోపణలు

Tej Pratap Yadav

Tej Pratap Yadav

తన రాజకీయ జీవితాన్ని ఐదు కుటుంబాలు నాశనం చేశాయని.. వారి పేర్లు వెల్లడిస్తామని గురువారం సోషల్ మీడియా వేదికగా లాలూ కుమారుడు, ఆర్జేడీ మాజీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. సోషల్ మీడియాలో ఒక యువతితో దిగిన ఫొటో వైరల్ కావడంతో ఆర్జేడీ నుంచి 6 సంవత్సరాలు బహిష్కరణకు గురయ్యారు. ప్రస్తుతం ‘టీం తేజ్ ప్రతాప్ యాదవ్’ పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రారంభించి బీహార్ ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు.

ఇది కూడా చదవండి: Supreme Court: జంతు ప్రేమికులకు ఊరట.. వీధి కుక్కల తీర్పుపై కీలక పరిణామం

తేజ్ ప్రతాప్ యాదవ్.. లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు. తేజస్వి యాదవ్ సోదరుడు. ప్రస్తుతం రాజీకాయాల్లోనూ.. సొంత కుటుంబం నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తేజ్ ప్రతాప్ పెట్టిన పోస్ట్ తీవ్ర కలకలం రేపింది. గతంలో అనుష్క యాదవ్ అనే మహిళతో ఉన్న ఫొటో వైరల్ కావడంతో ఆరు సంవత్సరాలు పాటు కుటుంబం నుంచి, పార్టీ నుంచి వేటుకు గురయ్యారు.

ఇది కూడా చదవండి: US: రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ఢిల్లీనే ఆజ్యం పోస్తోంది.. అమెరికా వాణిజ్య సలహాదారు తీవ్ర వ్యాఖ్యలు

తన పదేళ్ల రాజకీయ జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదని.. కుట్ర కూడా చేయలేదన్నారు. కానీ ఐదు కుటుంబాలు మాత్రం తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాయన్నారు. ఆ ఐదు కుటుంబాల పేర్లు శుక్రవారం వెల్లడిస్తానని.. వారి ముఖాలు, స్వభావాన్ని ప్రజల ముందు ఉంచుతానని పేర్కొన్నారు. కుట్రలను బహిర్గతం చేయబోతున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Uttarakhand: దారుణం.. క్లాస్‌ రూమ్‌లో తిట్టాడని టీచర్‌ను కాల్పులు జరిపిన 9వ తరగతి విద్యార్థి

అయితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే తేజ్ ప్రతాప్ ఖండించారు. తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్ చేశారని… తన వ్యతిరేకులు వివాదాస్పద కంటెంట్‌ను పోస్ట్ చేశారని కొట్టిపారేశారు. పోస్ట్ వివాదం కావడంతో ఈ మధ్యలో ఏం జరిగిందో.. ఏమో తెలియదుగానీ మొత్తానికి తేజ్ ప్రతాప్ వెనక్కి తగ్గారు.

ప్రస్తుతం బీహార్‌లో ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు తేజ్ ప్రతాప్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రత్యర్థులను ‘జయచంద్ (దేశద్రోహి)’ అనే పదంతో పదే పదే లక్ష్యంగా విమర్శిస్తున్నారు. తన రాజకీయ జీవితాన్ని అంతం చేయడానికి ‘జయచంద్’ల బృందం తనపై కుట్ర పన్నిందని ఆరోపిస్తున్నారు.

Exit mobile version