Site icon NTV Telugu

Delhi: బాలుడి హత్య కేసులో లేడీడాన్ జిక్రా అరెస్ట్.. ఆమె ఎవరంటే..!

Ladydonziqra

Ladydonziqra

దేశ రాజధాని ఢిల్లీలోని సీలంపూర్‌లో జరిగిన బాలుడి హత్య వెనుక లేడీడాన్ జిక్రా హస్తం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఎప్పుడూ 10-12 మంది గ్యాంగ్‌ను వేసుకుని రోడ్లపై హల్‌చల్ చేస్తుంటుందని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. బాలుడు కునాల్‌ను హత్య చేసిన స్థలంలో జిక్రా కూడా ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆమె సమక్షంలోనే బాలుడు హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు. గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబాతో జిక్రాకు ప్రేమ సంబంధం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల హోలీ సందర్భంగా తుపాకీ చేత పట్టి హల్‌చల్ చేసింది. అంతేకాకుండా రోడ్డుపై డ్యాన్స్ కూడా చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: GT vs DC: ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ-గుజరాత్ మధ్య 5 మ్యాచ్‌లు.. అత్యధికంగా గెలిచిన టీం ఇదే!

పాలస్తీనా జెండా ప్రొఫైల్ ఫొటో ఉన్న జిక్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 15,300 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె హ్యాండిల్‌లో లేడీడాన్‌ అని రాసుకుంది. ఇటీవల వివిధ పాటలకు నృతం చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఎప్పుడూ సీలంపూర్‌లోనే తుపాకీ పట్టుకుని తిరుగుతుంటుంది. ఇక ఆయుధ చట్టం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఆమె విడుదలైంది. కునాల్‌ను పలుమార్లు జిక్రా బెదిరించినట్లుగా బాధితుడి తండ్రి తెలిపారు. కనిపిస్తే చంపేస్తానని బెదిరించిందని వాపోయాడు.

ఇది కూడా చదవండి: Chhattisgarh: దొంగతనం చేశారని.. కార్మికులకు విద్యుత్ షాక్, గోళ్లను ఊడపీకి పైశాచికం..

కునాల్ గురువారం సాయంత్రం పాలు కొనేందుకు బయటకు వెళ్లాడు. ఆ సమయంలో దుండగులు కాపు కాచి కత్తితో పొడిచి చంపేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు సమీపంలో ఉన్న క్లినిక్‌కు వెళ్లాడు. కానీ ప్రాణాలు నిలువలేదు. ఇక నిందితులను అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళన చేపట్టారు. అయితే నవంబర్‌లో జరిగిన ఓ దాడిలో కునాల్ పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. దానికి ప్రతీకారంగానే నిందితుల్లో ఒకడు ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తెలుపుతున్నారు.

ఇదిలా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాల మేరకు దాదాపు 10 బృందాలు మిగతా నిందితుల కోసం గాలిస్తు్న్నారు. నిందితులు షోయబ్-మస్తాన్ ముఠాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. లేడీడాన్ జిక్రాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Delhi: బాలుడి హత్యపై నిరసనలు.. నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్

Exit mobile version