NTV Telugu Site icon

Rahul Gandhi: ఇది “కుర్చీని కాపాడుకునే”, “కాపీ పేస్ట్” బడ్జెట్..

Rahul

Rahul

Rahul Gandhi: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25పై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీనిని కాపీ పేస్ట్ బడ్జెట్‌గా అభివర్ణించింది. తమ మానిఫెస్టోలని అంశాలనే బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. ఇది పదవిని కాపాడుకునే బడ్జెట్‌గా అభివర్ణిస్తూ ‘కుర్సీ బచావో’’ బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు. మిత్ర పక్షాలను బుజ్జగించేందుకు బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. వ్యాపారవేత్తలకు మాత్రమే ప్రయోజనమని, సామాన్య భారతీయులకు ఎలాంటి ఉపశమనం లభించలేదని చెప్పారు. AAకి ప్రయోజనాలు కల్పించారని పరోక్షంగా అదానీ ,అంబానీలను ప్రస్తావించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో్ నుంచి కాపీ పేస్ట్ చేశారని రాహుల్ గాంధీ అన్నారు.

Read Also: CM Chandrababu: ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

కాంగ్రెస్ మేనిఫెస్టో నుంచి కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాపీ పేస్ట్ చేశారని అన్నారు. నిరుద్యోగం నిర్మూలించేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టో పేర్కొన్న స్కీములను బడ్జెట్‌లో ప్రస్తావించారని చెప్పారు. ‘‘ గురువు ఎప్పుడూ గురువే’’ అని ఆ పార్టీ నేత జైరా రమేష్ అన్నారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఊసే లేదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్నఘ్ను సిన్హా అన్నారు.