Kulgam Encounter: అల్లాహ్‌ను కలవాలని ఉంది.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. ఎన్‌కౌంటర్‌కు ముందు లతీఫ్ భట్ చివరి మాటలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kulgam Encounter Video: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య మరోసారి భీకర ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో లష్కర్ కమాండర్‌గా గుర్తించిన ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. అయితే, ఎన్‌కౌంటర్‌కు ముందు భద్రతా బలగాలు అతడితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. లొంగిపోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అతడు నిరాకరించాడు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో జానాగల్పోరా ప్రాంతంలోని ఓ మసీదులో లతీఫ్ భట్ చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో భద్రతా బలగాలు అతడిని చుట్టుముట్టాయి. అనంతరం అతడితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి లొంగిపోవాలని సూచించాయి. ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆయుధాలు విడిచిపెట్టి బయటకు రావాలని కోరాయి. అయితే, లతీఫ్ భట్ మాత్రం లొంగిపోవడానికి ససేమిరా అన్నాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉగ్రవాది మొదట అరబిక్ భాషలో ప్రార్థన చేస్తున్నట్లు వినిపిస్తోంది. అనంతరం భద్రతా బలగాల విజ్ఞప్తికి సమాధానమిస్తూ.. “నేను బయలుదేరాను. నాకు అల్లాహ్‌ను కలవాలని ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అల్లాహ్‌ను చూస్తాను.. అల్లాహ్ ప్రవక్తను కలుస్తాను” అంటూ మాట్లాడినట్లు వీడియోలో ఉంది. ఈ సందర్భంగా అతడు “అల్లాహు అక్బర్” అని పలికాడు.
Also Read
- RS 12 Crore Lottery Jackpot: గెలిపించిన నమ్మకం.. 15 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. ట్రక్ డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ!
- Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
- Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
- Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
వీడియో కాల్లో భద్రతా బలగాలకు చెందిన ఓ జవాన్ లతీఫ్‌తో మాట్లాడాడు. “లతీఫ్ భాయ్.. మీతో మాట్లాడుతున్నాం. ఎందుకు ఇలా చేస్తున్నారు? లొంగిపోండి.. ఆగండి.. నేను అక్కడికి వస్తాను” అంటూ అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. దీనికి సమాధానంగా లతీఫ్ భట్.. “నాతో అల్లాహ్ మాత్రమే ఉన్నాడు. నాకు అల్లాహ్ ఒక్కడే సరిపోతాడు” అంటూ లొంగిపోవడానికి నిరాకరించినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే, భద్రతా బలగాల విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు హతమయ్యాడు. వీడియోలో ఉగ్రవాది పలికిన ‘అల్లాహు అక్బర్’ అనేది అరబిక్ భాషకు చెందిన పదబంధం. దీని అర్థం ‘అల్లాహ్ అత్యంత గొప్పవాడు’ లేదా ‘దేవుడు అందరికంటే గొప్పవాడు’ అని. ఇస్లాంలో దీనిని ‘తక్బీర్’ అని పిలుస్తారు. ముస్లింలు ప్రార్థనలతో పాటు వివిధ సందర్భాల్లో ఈ పదబంధాన్ని ఉపయోగిస్తారు.
లతీఫ్ భట్ హతమవడంతో కుల్గామ్ ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్‌వర్క్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో అతడి పాత్రపై మరిన్ని అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, అంతకుముందు కుల్గామ్‌లోని CRPF క్యాంపుపై జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో కుట్రకు సంబంధించిన ఆధారాలను NIA సేకరించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో కుల్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరింత ముమ్మరం చేస్తున్నాయి.
“I have to go to Allah. Allah is enough for me”
Wanted Lashkar-e-Taiba commander Mohammad Latif Bhat refused to surrender despite repeated appeals by the Commanding Officer of 9 Rashtriya Rifles and the Kulgam SSP during an encounter in South Kashmir’s Kulgam
An Army officer continued urging him to lay down his arms, but he refused. Gunfire followed
— Nabila Jamal (@nabilajamal_) November 18, 2026
తాజావార్తలు
-
Akvan Cyclone: అక్వాన్ తుఫాన్ ముప్పు.. హోంమంత్రి అనిత సమీక్ష.. అత్యవసర సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు..
-
Kulgam Encounter: అల్లాహ్‌ను కలవాలని ఉంది.. నేను చాలా సంతోషంగా ఉన్నా.. ఎన్‌కౌంటర్‌కు ముందు లతీఫ్ భట్ చివరి మాటలు!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
IFFI అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా చరిత్ర సృష్టించిన ‘మయసభ’..!
-
RC17 Heroine: హీరోయిన్ రేసులో ఐదుగురు కుర్ర భామలు.. సుకుమార్ మనసులో ఎవరున్నారు?
ట్రెండింగ్
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!