Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల్న హతం చేయడానికి భద్రతా బలగాలు ‘‘ఆపరేషన్ మహదేవ్’’ నిర్వహిస్తోంది. తాజాగా, కుల్గాంలోని అకల్ దేవ్‌సర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు ప్రస్తుతం భద్రతా బలగాల ట్రాప్‌లో చిక్కుకున్నారని తెలుస్తోంది.
Read Also: Kiren Rijiju: రాహుల్ గాంధీ పిల్లవాడు కాదు, దేశ ప్రతిష్టకు హాని కలిగించొద్దు..
ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. సమాచారం ప్రకారం, కొనసాగుతున్న ఆపరేషన్‌లో భాగంగా శ్రీనగర్ సమీపంలోని దచిగామ్ నేషనల్ పార్క్ ప్రాంతంలో అనుమానాస్పద ఉగ్రవాద కదలికలు కనుగొన్నారు. లష్కర్ అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’కు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులు అడవుల్లో దాక్కున్నారని భావిస్తున్నారు. ముందుగా మొత్తం ఐదుగురు టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందింది. వీరిలో ముగ్గురు సోమవారం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఇద్దరు పరారీలో ఉన్నారు.
