BRS Office Inauguration: ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్.. దేశంలో గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంథాను అనుసరించారో, ఇవాళ దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని కేసీఆర్ ప్రారంభిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక అనుమతితో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోతున్నానని వెల్లడించారు. ముందే నిర్ణయించబడిన రెండు కీలకమైన పెట్టుబడి సమావేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సిరిసిల్లలో సెస్ ఎన్నికల నామినేషన్లు కూడా ఈ రోజే ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యాహ్నం ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరుకాలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉంటున్నారు. జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్ తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు.
దేశ రాజకీయాల్లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం పాటుపడిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నేతలు అభినందనలు తెలిపారు. అనంతరం రాజశ్యామల యాగం పూర్ణాహుతికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హాజరయ్యారు. మరోవైపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ శ్రేణులు, ముఖ్య నేతలతో సందడి వాతావరణం నెలకొంది.
Jogi Ramesh: లోకేష్‌కు మంత్రి జోగి రమేష్ సవాల్.. దమ్ముంటే జగనన్న కాలనీలకు రండి
