Site icon NTV Telugu

KTR : అందుకే కాంగ్రెస్ పార్టీ ఆర్థిక నాటకాలు ఆపింది

Ktr

Ktr

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పులపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఖండించారు. రేవంత్ రెడ్డి పొడుగుచేసిన అప్పులపై వివాదాలను ఆయన కఠినంగా విమర్శించారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు ఉన్న అప్పు మొత్తం 8 లక్షల కోట్లుగా కాదు, కేవలం రూ. 3.5 లక్షల కోట్లే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ నిజాలు బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ ఆర్థిక నాటకాలు ఆపవలసి వచ్చింది.

Donald Trump: అధికార మదం తలకు ఎక్కిందా? నిరాశ్రయులందరూ వెంటనే వెళ్లిపోండి.. ట్రంప్‌ ఘాటు వ్యాఖ్యలు!

కేటీఆర్ మాట్లాడుతూ, మేం అప్పులు తీసుకున్నా ఆస్తులు సృష్టించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తామన్నారు. దీనిపై కాంగ్రెస్ విధానం విఫలమై ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి కోసం సమర్థమైన ఆర్థిక పాలన అవసరమని, ప్రభుత్వ బాధ్యతలను కట్టుబడి నిర్వహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు అబద్ధాల బాటలో పడకుండా నిజాలను అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Anas Al-Sharif: ఉగ్రవాదా.. జర్నలిస్టా.. గాజాలో మరణించింది ఎవరు?

Exit mobile version