NTV Telugu Site icon

Kolkata rape-murder case: నాకు రోటీ-సబ్జీ వద్దు, ఎగ్ న్యూడిల్స్ కావాలి.. నిందితుడి డిమాండ్..

Kolkata Rape Murder Case

Kolkata Rape Murder Case

Kolkata rape-murder case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నిందితుడిని వెంటనే శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్‌ని ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది.

Read Also: Pakistan: పాక్‌కి సాయం చేయొద్దని చెప్పినా పెంటగాన్ వినలేదు.. ట్రంప్ ఆదేశాలు బేఖాతరు..

ఇదిలా ఉంటే, ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్ జైలులో ఆహారం విషయంలో కోరికలు కోరుతున్నట్లు తెలుస్తోంది. సాధారణ కూర, రోటీకి బదులుగా తనకు ఎగ్ చౌమీన్(ఎగ్ న్యూడిల్స్) డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ జైలులో భోజనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ఎగ్ చౌమీన్ తినడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే, జైలు నిబంధనల ప్రకారం, ఖైదీలందరికి ఒకే రకమైన ఆహారాన్ని అందిస్తారు. దీంతో సంజయ్ రాయ్ డిమాండ్‌ని అధికారులు పట్టించుకోలేదు.

రోటీ, కూరగాయలతో తయారు చేసిన కర్రీని వడ్డించడంపై అతను ఆగ్రహంగా ఉన్నాడని, అయితే జైలు అధికారులు మందలించిన తర్వాత చివరకు తినడానికి అంగీకరించాడని నివేదిక పేర్కొంది. ఆగస్టు 09న జరిగిన ఘటనలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన సెమినార్ హాలు నుంచి సంజయ్ రాయ్ తెల్లవారుజామున 4.03 గంటలకు ప్రవేశించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో కనుగొనబడింది. రాయ్‌కి చెందిన బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఘటన స్థలంలో కనుగొనబడింది. ఇదే కాకుండా అతడి చెంపపై గాయాలు, ఎడమ ఉంగరపు వేలు మధ్య ఎడమ చేతిలో రాపిడి, అతడి ఎడమ తొడపై గాయాలు వంటి సంకేతాలను పోలీసులు గుర్తించారు.