NTV Telugu Site icon

Kolkata: కోల్‌కతా దుర్గాపూజా మండపంపై ముస్లింగుంపు దాడి.. విగ్రహాలు ధ్వంసం చేస్తామని బెదిరింపు..

Kolkata

Kolkata

Kolkata: కోల్‌కతాలో కొందరు మతోన్మాదుల ముస్లింమూక దుర్గా విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. నగరంలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని న్యూ బెంగాల్ స్పోర్టింగ్ క్లబ్‌కి చెందిన పూజా మండపై ముస్లిం గుప్పు దాడి చేసి, పూజలు నిర్వహించరాని బెదిరించారు. దాదాపుగా 50-60 మంది సభ్యులతో కూడిన ముస్లిం గుంపు వేడకల్ని ఆపకపోతే విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.

Read Also: India – Bangladesh: క్రమపద్ధతిలో హిందువుల, హిందూ ఆలయాలపై దాడులు.. బంగ్లాదేశ్ తీరుపై భారత్ ఆగ్రహం..

దీనిపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పుడు ఈ అంశంపై ప్రతిపక్ష బీజేపీ అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి, దుర్గామండపంలోకి ముస్లింగుంపు ప్రవేశించిన వీడియోను పంచుకున్నారు. ‘‘ కోల్‌కతా సీపీ శ్రీ మనోజ్ కుమార్ వర్మ ఇది ఏమిటి..? కోల్‌కతా పోలీస్ అధికార పరిధిలోని దుర్గాపూజ మండపంలోకి చొరబడి, హిందూ ఆచారాలను ఆపకపోతే దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించే ధైర్యాన్ని ఈ గుండాలు ఎలా సంపాదించుకున్నారు..?’’ అని సువేందు అధికారి ప్రశ్నించారు. పోలీసులు దోషులపై సాధ్యమైనంత త్వరగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇది కోల్‌కతా అని ఢాకా కాదని గ్రహించాలని అన్నారు.

శుక్రవారం మధ్యామ్నం ఒంటిగంట సమయంలో సుమారు 50-60 మంది ముస్లింలు మా పూజామండపంలోకి వచ్చి అంతరాయం కలిగించారని, దుర్గామాత విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించారని నిర్వాహకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందూ మహిళల్ని వారు దూషించినట్లు పేర్కొన్నారు.

Show comments