NTV Telugu Site icon

Trinamool Congress Leader: ‘‘ఇస్లాంని వ్యాప్తి చేయాలి’’.. తృణమూల్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

Trinamool Congress

Trinamool Congress

Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముస్లిమేతరులతో ఇస్లాంను వ్యాప్తి చేయాలంటూ, బహిరంగ మతమార్పిడులను ప్రోత్సహించారు. ముస్లిమేతరులు దురదృష్టవంతులని, అల్లాహ్‌ని సంతోషపెట్టడానికి వారిని ఈమాన్‌లోకి తీసుకురావానలి చెప్పడం వివాదాస్పదమైంది. ‘‘ఆల్ ఇండియా ఖురాన్ పోటీ’’ సందర్భంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలోని ధోనో ధన్యో ఆడిటోయంలో జూలై 3న ఈ కార్యక్రమం జరిగింది.

Read Also: Samantha: సమంత ఆరోగ్య చిట్కాపై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..డార్క్ రియాలిటీ అంటూ!

‘‘ఇస్లాంలో పుట్టని వారు దురదృష్టవంతులు. వారు దురదృష్టంతో జన్మించారు. మేము వారిని ఇస్లాంలోకి తీసుకురావాలి’’ అని ఫిర్హాద్ హకీమ్ అన్నారు. ‘‘మనం ముస్లిమేతరుల మధ్య ఇస్లాంను వ్యాప్తి చే యాలి. మనం ఎవరినైనా ఇస్లాం మార్గంలోకి తీసుకురాగలిగితే, మనం నిజమైన ముస్లింలుగా నిరూపితమవుతాం’’ అని చెప్పారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఫిర్హాద్‌కి ఇదే తొలిసారి కాదు. ఏప్రిల్ 2016లో కోల్‌కతాలో ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాన్ని ‘‘మిని పాకిస్తాన్’’ అని పిలిచాడు.

ఇదిలా ఉంటే తృణమూల్ నేత, సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ఫిర్హాద్ హకీమ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మాట్లాడుతూ..‘‘ పశ్చిమ బెంగాల్‌లో విపరీతమైన బుజ్జగింపు రాజకీయాల జరుగుతున్నాయి’’ అని దుయ్యబట్టారు. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలు బహిరంగ రహస్యం, టీఎంసీ అహంకారంతో విర్రవీగుతోందని, ఎన్నికల హింసాకాండతో ఇది స్పష్టమైందని మాల్వియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇది హిందూ మతంలోని లోతైన ఆధ్యాత్మికతను అవమానించడమే కాకుండా దేశం గౌరవించే సామస్యం, ఐక్యతను కూడా బెదిరిస్తోందని బెంగాల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ అన్నారు.