Nabanna Abhijan protest: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘాలు ‘పశ్చిమబంగా ఛాత్రో సమాజ్’ ఇవాళ (మంగళవారం) నిరసన చేపట్టింది. ‘నబన్నా అభియాన్’ పేరుతో హావ్‌డా నుంచి స్టూడెంట్స్ ర్యాలీని స్టార్ట్ చేశారు. అయితే, విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో హావ్‌డాలోని సంతర్‌గాచి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read Also: Allu Arjun-Atlee: అట్లీతో బన్నీ సినిమా.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
కాగా, మార్చ్‌లో పాల్గొన్న ఆందోళనకారులు బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ట్రై చేశారు. కొన్నింటిని లాగి పడ వేశారు.. దీంతో పోలీసులపైకి రాళ్లు రువ్వారు.. ఇక, విద్యార్థుల పైకి బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు సైతం జరిపారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంది. ఈ ర్యాలీ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆందోళన నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఎలాంటి అభ్యర్థన రాలేదని రాష్ట్ర పోలీసులు చెప్పారు.
అలాగే, ఈ మార్చ్ జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఆ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. ఆ విద్యార్థులు అర్ధరాత్రి టైంలో అదృశ్యమయ్యారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. విద్యార్థులు మిస్ అయ్యారంటూ కొందరు రాజకీయ నేతలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని బెంగాల్ పోలీసులు ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
