Allu Arjun-Atlee: అట్లీతో బన్నీ సినిమా.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
- అక్టోబర్ చివరికి పుష్ప 2 షూట్ పూర్తి
- బన్నీ తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ వెయిటింగ్
- అట్లీ-బన్నీ సినిమా లేటెస్ట్ అప్‌డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప 2’ రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయింది. డిసెంబర్ 6న పాన్ ఇండియా బాక్సాఫీస్ దడదడలాడిపోనుంది. అయితే సినిమా షూటింగ్ విషయంలోనే కాస్త డౌట్స్ ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ చివరికి టోటల్ టాకి షూట్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌పై ఫోకస్ పెట్టనున్నాడు సుక్కు మాస్టర్. పుష్ప షూటింగ్ అక్టోబర్‌లో అయిపోతుంది కాబట్టి.. మరి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అనేది తేలాల్సి ఉంది.
ఇప్పటికే బన్నీతో సందీప్ రెడ్డి వంగ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అనౌన్స్ చేశారు. సందీప్ సినిమా మొదలవడానికి మరో 3-4 ఏళ్ల సమయం పట్టేలా ఉంది. దాంతో త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ ఐకాన్ స్టార్‌తో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా లైన్లో ఉన్నాడు. అయితే ఆ మధ్య ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఈ క్రేజీ కాంబో క్యాన్సిల్ కాలేదని ఈ మధ్య క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు సినిమా ఉంటుందా?.. ఉండదా.. అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోనుందట.
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
Also Read: Pushpa 2 Climax: ‘పోతారు.. మొత్తం పోతారు’.. పుష్ప 2 క్లైమాక్స్‌పై మేకర్స్ ట్వీట్!
అట్లీ సినిమా ఓకే అయితే.. త్రివిక్రమ్ సినిమా కంటే ముందే మొదలయ్యే ఛాన్స్ లేకపోలేదు. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీతో వెయ్యి కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయిన అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప2 వంటి క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత అట్లీతో బన్నీ సినిమా ఉంటే.. మామూలుగా ఉండదు. బన్నీ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!