NTV Telugu Site icon

Kolkata Doctor Rape Case: సీఎంతో మరోసారి చర్చలు జరపాలి.. బెంగాల్ డాక్టర్స్ డిమాండ్..!

Kolkata Issue

Kolkata Issue

Kolkata Doctor Rape Case: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపిన వైద్యులు తమ నిరసనలు ఇంకా కొనసాగిస్తున్నారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు మరోసారి ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలికి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Read Also: MAD Square : ఫస్ట్ లుక్ – ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది..

ఇక, ఆరోగ్య కార్యదర్శిని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఈరోజు (బుధవారం) ఉదయం నుంచి రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేంత వరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని డాక్టర్లు హెచ్చరించారు. కోల్‌కతా ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎన్‌ఎస్‌ నిగమ్‌ను వెంటనే డ్యూటీ నుంచి తొలగించాలి అన్నారు. అంతేకాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి అని వారు డిమాండ్ చేశారు. ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం అసవరం అని చెప్పుకొచ్చారు. మరికొన్ని డిమాండ్లను వినిపించేందుకు ముఖ్యమంత్రితో మరోసారి చర్చలకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు.

Read Also: CV Anand: వచ్చే ఏడాది నుంచి పద్ధతి మారాలి.. భక్తులకు సీవీ ఆనంద్ విజ్ఞప్తి

కాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ చీఫ్‌ సెక్రటరీ మనోజ్‌ పంత్‌కు మెయిల్‌ పంపినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో డాక్టర్లకు కల్పించే భద్రతతో పాటు ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల రూపాయలను ఎలా ఖర్చు చేయాలనుకుంటున్నారనే అంశాలపై సమగ్రంగా చర్చించాలని వారు కోరారు. కాగా, జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న డాక్టర్లతో రాష్ట్ర సీఎం మమతా చర్చలు జరిపారు.