Arunachal Pradesh: వరదలు బీభత్సం.. ప్రమాదకర వీడియో విడుదల చేసిన కిరణ్ రిజిజు
- అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదలు బీభత్సం
- ప్రమాదకర వీడియో విడుదల చేసిన కిరణ్ రిజిజు
ఈశాన్య రాష్ట్రాలు గత 48 గంటలుగా కుండపోత వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటి వరకు 30 మంది వరకు చనిపోయారు. ఇక లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు.
ఇది కూడా చదవండి: PM Modi: కెనడా “G-7 సమ్మిట్”కు ప్రధాని మోడీ వెళ్లడం లేదు.. రెండు దేశాల మధ్య సంబంధాలే కారణం.!
Also Read
అయితే భారీ వర్షాలు కారణంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే వరదలు ముంచెత్తడంతో ఆయా ప్రాంతాలు ప్రమాదకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అయితే ఒక వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో వేలాడే వంతెనపై ప్రమాదకరంగా ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి కిర్ రిజిజు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇలా ప్రమాదకర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దయచేసి జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి. ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందిస్తుందని కేంద్రమంత్రి రాసుకొచ్చారు. చైనా-మయన్మార్ సరిహద్దుల ట్రై-జంక్షన్ సమీపంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Mrunal Thakur: ఇంత పిసినారి హీరోయిన్ని ఎక్కడ చూసి ఉండరు..
ఈ వంతెన వెదురు, తాడు, చెక్క పలకలతో తయారు చేయబడినట్లు కనిపిస్తోంది, గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వీటిలో చాలా వరకు కొట్టుకుపోయాయి. ఇదొక్కటే ఉండడంతో ప్రమాదకరంగా ప్రయాణం చేశాడు. ఒకవేళ తెగిపోతే ప్రాణాలు పోయినట్లే.
ఇక వరదల కారణంగా చనిపోయిన కుటుంబాలకు ముఖ్యమంత్రి పెమా ఖండు సంతాపం వ్యక్తం చేశారు. బాధిత ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ఖండు కోరారు. ప్రస్తుతానికి నదులు మరియు నీటి వనరులలోకి దిగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంబంధిత అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
ArunachalPradesh receives heaviest Monsoon rains in the world. Got this video of a man crossing traditional hanging bridge in Anjaw district, Arunachal Pradesh near tri-junction of India, China & Myanmar border. Please remain careful & safe. Govt will provide necessary support. pic.twitter.com/GZ9ypeOzZj
— Kiren Rijiju (@KirenRijiju) June 1, 2025
తాజావార్తలు
-
Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. “ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0” ప్రారంభం.!
-
IPL 2026: 8 మ్యాచ్‌లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
-
Realme C100x: రియల్మీ C100x భారత్‌లో త్వరలో లాంచ్.. 8000mAh బ్యాటరీతో బిగ్ సర్ప్రైజ్!
-
Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్డేట్… ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
-
Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!