Site icon NTV Telugu

Operation Sindoor: రావణుడు లక్ష్మణ రేఖ దాటితే లంక కాలిపోయింది.. పాకిస్తాన్‌కి కూడా అదే గతి..

Kiren Rijiju

Kiren Rijiju

Operation Sindoor: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు పార్లమెంట్‌లో చర్చ జరగబోతోంది. చర్చకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. దీనిపై కేంద్రం తరుపున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, అమిత్ షా మాట్లాడుతారని తెలుస్తోంది. సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగుతుంది.

Read Also: Fake Apple Products: హైదరాబాద్ లో నకిలీ యాపిల్ ఉత్పత్తుల స్కాం.. రూ.3 కోట్ల విలువైన యాపిల్ యాక్సెసరీస్ స్వాధీనం

ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్‌పై ఈ రోజు సభలో చర్చ జరగడానికి ముందు, కేంద్రమంత్రి కిరెన్ రిజిజు పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. రామాయణాన్ని ఉటంకిస్తూ, పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఆపరేషన్ సిందూర్‌పై ఈ రోజు చర్చ ప్రారంభం.. రావణుడు లక్ష్మణ రేఖను దాటినప్పుడు, లంక కాలిపోయింది. భారతదేశం గీసిన రెడ్ లైన్ పాకిస్తాన్ దాటినప్పుడు, ఉగ్రవాద శిబిరాలు అగ్నికి ఆహుతయ్యాయి’’ అని ఎక్స్‌లో ఒక పోస్టులో రాశారు.

ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ లో చర్చ కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాల్పుల విరమణ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మోడీ ఒప్పుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎన్ని యుద్ధవిమానాలు కోల్పోయామో చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం సమాధానం ఇవ్వాలని విపక్షాలు అడుగుతున్నాయి. అయితే, రెండు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) మధ్య సంప్రదింపుల తర్వాతే కాల్పుల విరమణ జరిగిందని, ఇందులో ట్రంప్ ప్రేమేయం లేదని భారత్ స్పష్టం చేసింది.

Exit mobile version