Site icon NTV Telugu

Kiren Rijiju: కాశ్మీర్ విలీనాన్ని ఆలస్యం చేసింది నెహ్రూనే.. మహారాజా హరిసింగ్ కాదు.

Jawaharlal Nehru

Jawaharlal Nehru

Nehru delayed Kashmir’s accession to India not the Maharaja says union minister Kiren Rijiju: జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ చేసిన ట్వీట్లకు స్పందిస్తూ దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనాన్ని ఆలస్యం చేసింది జవహర్ లాల్ నెహ్రూనే అని.. జమ్మూ కాశ్మీర్ మహారాజు కాదని ఆయన ట్వీట్ చేశారు.

Read Also: Ram Gopal Varma: గరికపాటి చూపంతా ఆ హీరోయిన్ మీదే ఉందట.. వర్మ వీడియో వైరల్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో జరిగిన ర్యాలీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడని.. ఒక వ్యక్తి మాత్రం జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేదని పరోక్షంగా జవహర్ లాల్ నెహ్రును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా జైరాం రమేష్ ట్వీట్ చేశారు. భారత్ లో చేరడకుండా మహారాజా హరిసింగ్ కలలు కన్నారని.. పాకిస్తాన్ దాడి తర్వాత హరిసింగ్ భారతదేశంలో చేరేందుకు మొగ్గు చూపాడని.. షేక్ అబ్దుల్లా(జమ్మూ కాశ్మీర్ మొదటి సీఎం) భారతదేశంలో విలీనాన్ని సమర్థించారని.. నెహ్రుతో ఉన్న స్నేహం, గాంధీజీ పట్ల ఉన్న గౌరవం కారణంగా భారతదేశంలో విలీనాన్ని సమర్థించారని ట్వీట్స్ చేశారు.

ఈ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ చారిత్రక అబద్ధం చాలా కాలంగా సాగుతోందని.. స్వాతంత్య్రానికి నెల ముందు జూలై, 1947లోనే తొలిసారి మహారాజా హరిసింగ్ నెహ్రూను సంప్రదించారని..అయితే జవహర్ లాల్ నెహ్రూ మహారాజును తప్పిపంపారని.. కాశ్మీర్ భారత్ లో చేరడాన్ని ఆలస్యం చేసింది నెహ్రూనే అని అన్నారు. దీని వల్ల అక్టోబర్ 1947లో పాకిస్తానీ ఆక్రమణదారులు శ్రీనగర్ పట్టణానికి కిలోమీటర్ దూరం వరకు వచ్చారని కిరణ్ రిజిజు దుయ్యబట్టారు. నెహ్రూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కొన్ని ప్రత్యేక చట్టాలను రూపొందించారని.. దీనికి ఇప్పటికీ భారత్ మూల్యం చెల్లిస్తోందని అన్నారు.

Exit mobile version