Site icon NTV Telugu

Pakistan: ‘‘ కాశ్మీర్ వెళ్లండి, ఇక్కడేం పని’’.. పాక్ ఆర్మీ, పోలీసుల మధ్య ఘర్షణ.. వీడియో వైరల్..

Pak Army Vs Police

Pak Army Vs Police

Pakistan: 26 మంది టూరిస్టుల్ని బలి తీసుకున్న పహల్గామ్ ఉగ్రవాద ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ భయపడి చస్తోంది. ఇదిలా ఉంటే, పాక్ అంతర్గత పరిస్థితులు కూడా ఆశాజనకంగా లేవు. బలూచిస్తాన్‌‌లో బీఎల్ఏ, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్ల దెబ్బకు పాక్ సైన్యం తోకముడుస్తోంది. పాక్ సైన్యంలో పంజాబ్ ఆధిపత్యాన్ని ఇతర ప్రాంతాలు సహించడం లేదు.

Read Also: Shahid Afridi: షాహిద్ అఫ్రీది బంధువు పెద్ద ఉగ్రవాది అని మీకు తెలుసా.? 2003లో కాశ్మీర్‌లో దాడికి యత్నం..

ఇదిలా ఉంటే, తాజాగా పాక్ ఆర్మీ, ఖైబర్ ఫఖ్తుంఖ్వా పోలీసుల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. లక్కీ మార్వాట్‌లోని పష్తూన్ పోలీసు అధికారులు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌ని పోలీస్ స్టేషన్లోకి రానివ్వలేదు. పోలీస్ అధికారులు ఆర్మీపైకే ఆయుధాలు ఎక్కుపెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పహల్గాం దాడి తర్వాత నుంచి కనిపించకుండా పోయిన నేపథ్యంలో ఆయనను ఉద్దేశించి కూడా పోలీసులు తీవ్ర వ్యాఖ్యలు చేయడం వీడియోలో కనిపిస్తోంది.

‘‘మీ దిమాక్ సరిగా పనిచేయడం లేదు. వారిని కాశ్మీర్ పంపండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. మీ జనరల్(ఆసిమ్ మునీర్) వచ్చినా, ఏం చేయలేడు. మేం లక్కీ మార్వాట్ పోలీస్ గుర్తుంచుకోండి. ఈ పంబాబ్ వాళ్లు ఇక్కడి వచ్చి నాటకాలు చేస్తున్నారు’’ అని అనడం వీడియోలో చూడవచ్చు. ఈ సంఘటన పాకిస్తాన్‌లోని అంతర్గత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది. https://twitter.com/AdityaRajKaul/status/1917554429206880376

Exit mobile version