BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…
- ఖర్గే ‘‘ఉగ్రవాది’’ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..
- ప్రధాని పదవిని కించపరిచారని ఫైర్..
- ప్రధానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాషాయ నేతల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ప్రధాని నరేంద్రమోడీని ‘‘ఉగ్రవాది’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు అన్నామలై, సంబిత్ పాత్ర వంటి వారు కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అన్నామలై మాట్లాడుతూ.. ఖర్గే ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆయన ప్రధాని పదవి గౌరవాన్ని దిగజార్చారని, ఖర్గే బహిరంగ క్షమాపణలు చెప్పి, ప్రజల్ని క్షమాభిక్ష కోరాలని డిమాండ్ చేశారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిరాశ, నిస్పృహ, మానసిక దివాళాను సూచిస్తున్నాయని అన్నారు. ఖర్గే వ్యాఖ్యలు 145 కోట్ల మంది ప్రజల్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా పన్నిన కుట్ర అని, రాహుల్ గాంధీ ప్రతీరోజూ తన ప్రసంగాలలో ప్రధానిపై అవమానకరమైన భాష ఉపయోగిస్తున్నారని, రాహుల్ ఆదేశాల మేరకు ఖర్గే ప్రధానిని ఉగ్రవాదిగా పిలిచారని ఆరోపించారు. ఒసామా బిన్ లాడెన్ వంటిని వారిని ‘‘ఒసామా జీ’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!