NTV Telugu Site icon

Khalistani Terrorist: ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే కుంభమేళాలో మోడీ, యోగినే మా టార్గెట్..

Khalistan

Khalistan

Khalistani Terrorist: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2025 ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే మహా కుంభమేళాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తామంటూ ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసినందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు.

Read Also: MT Vasudevan Nair: ప్రముఖ మలయాళ రచయిత, దర్శకుడు వాసుదేవన్ కన్నుమూత..

ఇక, 2025 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ లోపు దాడులు చేస్తామని ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వాంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. ఆ రోజుల్లోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌లో ఉంటారు.. ఈ మహా కుంభమేళానే ఈ ఇద్దరు నాయకులకు చివరిదిగా మారుస్తామని అతడు వార్నింగ్ ఇచ్చాడు. అయితే, ఉత్తరప్రదేశ్‌‌లోని పిలిభిత్‌‌లో యూపీ, పంజాబ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు ఖలిస్తానీ టెర్రరిస్టులను హతమర్చారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలంలో రెండు ఏకే-47 తుఫాకులతో పాటు రెండు గ్లాక్ పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Show comments