NTV Telugu Site icon

NDA CMs Key Meeting: ఢిల్లీలో ఎన్డీయే ముఖ్యమంత్రుల సమావేశం.. హాజరైన ప్రధాని మోడీ

Delhi Cms

Delhi Cms

NDA CMs Key Meeting: ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం దేశ రాజధానిలోని ఓ హోటల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. కాగా, ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం రాజకీయ బల ప్రదర్శనకు సాక్ష్యంగా నిలిచింది.

Read Also: Jailer : జపాన్‌లో రిలీజ్ కాబోతున్న జైలర్

ఇక, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎంకు, మంత్రులకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు ప్రత్యేకంగా అభినందనలు చెప్పారు. రేఖా గుప్తా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి, క్యాంపస్ రాజకీయాల్లో, రాష్ట్ర సంస్థలో, మున్సిపల్ పరిపాలనలో చురుకుగా పని చేశారు అని పేర్కొన్నారు. రేఖా గుప్తాతో పాటు ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్‌లతో కూడిన బృందం దేశ రాజధాని అభివృద్ధికి కృషి చేస్తారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.