Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్‌ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- కోటేశ్వరుడైన కేతన్‌ను సియా ఎందుకు వద్దనుకుంది?
- దర్యాప్తులో సంచలన విషయాలు
- తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్న కొత్త ట్విస్ట్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్.. కేతన్‌ను ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదనే విషయంపై పోలీసులు విచారణలో కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం.. సియా కేతన్‌ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. మొదటి కారణం సియా తన ప్రియుడు చేతన్ చౌదరిని ప్రేమించడం. రెండోది కేతన్ జుట్టు పలుచగా ఉండటం (థిన్నింగ్ హెయిర్), మూడోది మాట్లాడేటప్పుడు స్వల్పంగా నత్తిగా మాట్లాడటం (స్టామర్) సియాకు నచ్చలేదని విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే కేతన్కు స్వల్పంగా నత్తి ఉన్న విషయం ఇరు కుటుంబాలకు ముందే తెలుసని పోలీసులు తెలిపారు. దానిని అంత సమస్యగా భావించలేదని.. అది సాధారణ విషయంగానే తీసుకున్నారని సమాచారం.
Also Read
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
- Ethanol in Diesel: డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్‌లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
ఇక విచారణలో భాగంగా పోలీసులు సియాను.. ‘‘పెళ్లి ఇష్టం లేకపోతే కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పలేదు?.’’ అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి సియా.. పెళ్లిని వ్యతిరేకిస్తే కుటుంబ సభ్యుల మనసు దెబ్బతింటుందని భావించానని చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే పరిస్థితి నుంచి బయటపడటానికి కేతన్‌ను తొలగించడమే సులభమైన మార్గమని తాను భావించినట్లు సియా విచారణలో చెప్పినట్లు సమాచారం.
ట్రెక్కింగ్‌ను ప్రమాదంలా చూపించే కుట్ర?
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లి ఎత్తైన ప్రాంతం నుంచి కేతన్‌ను కిందకు తోసేస్తే అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా అందరూ నమ్ముతారని సియా ముందుగానే ప్రణాళిక రూపొందించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఘటన జరిగే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేవని భావించి.. తనపై ఎలాంటి ఆధారాలు దొరకవని సియా అనుకున్నట్లు కూడా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఇక కేతన్ పడిపోగానే ఎవరో పడిపోయారంటూ అరిచింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు అప్రమత్తం అయ్యాడు. ఇక చనిపోయింది కాబోయే భర్త కేతన్ అని తెలిసి కూడా ఒక్క కన్నీటి బుట్ట కూడా రాల్చనట్లుగా బాధిత కుటుంబం తెలిపింది. దీంతో అప్పటినుంచే కేతన్ సోదరికి అనుమానం కలుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, డిజిటల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, నిందితుల వాంగ్మూలాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!