Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- హత్యకు ముందు, తర్వాత చాట్ హిస్టరీ డిలీట్..
- కేతన్ హత్య కేసులో ఆధారాలు నాశనం చేసిన సియా, చేతన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal Case: కేతన్ అగర్వాత్ హత్య కేసులో విచారణ వేగవంతమైంది. నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలు హత్యకు ముందు, ఆ తర్వాత తమ మొబైల్ ఫోన్లలో చాట్ హిస్టరీ డిలీట్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కీలక ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. జూన్ 18న లోహ్‌గఢ్ కోటపై నుంచి కేతన్‌ను తోసేసి సియా హత్యకు పాల్పడింది. ఆ తర్వాత ఇద్దరూ చాట్ హస్టరీలను, రీసైకిల్ బిన్‌లోని డేటాను తొలగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో వారిద్దరి మొబైళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. డిలీట్ అయిన డేటాను రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
కేతన్‌తో వివాహం ఇష్టం లేని సియా పక్కా పథకం ప్రకారం హత్యకు పాల్పడింది. దీనికి ఆమె లవర్ చేతన్ సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హత్యకు ముందు ఏడాది కాలంలో సియా, చేతన్ మధ్య మొత్తం 2004 ఫోన్ కాల్స్ జరిగాయని, దాదాపుగా 238 గంటలు మాట్లాడుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ఇద్దరూ ఓ కేఫేలో కలుసుకుని కుట్ర అమలు గురించి చివరిసారిగా చర్చించుకున్నట్లు తేలింది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఈ హత్యలో ప్లాన్ ప్రకారం, కోట వద్ద సియా నేలపై కూర్చోవడం ద్వారా చేతన్‌కు సిగ్నల్ ఇచ్చిందని, ఆ వెంటనే వెనక నుంచి వచ్చి కేతన్‌ను లోయలో తోసినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదట సంఘటనా స్థలంలో తాను లేనట్లు చేతన్ అబద్ధాలు చెప్పినా, చివరకు ఇద్దరు ఈ హత్యలో తమ పాత్ర ఉన్నట్లు అంగీకరించారు. ఈ కేసులో సియా సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు, కేతన్ కుటుంబ కోరిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించేందుకు అంగీకరించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను నియమించింది. ఈయన ముంబై దాడుల ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్ష పడేలా చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!