NTV Telugu Site icon

Kerala: పీఎఫ్ఐ నుంచి ప్రమాదం..ఆర్ఎస్ఎస్ నేతలకు వై కేటగిరి భద్రత.

Y Category Security

Y Category Security

Y-category security for RSS leaders: రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్పైఐ) దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో దాడులు జరిగాయి. ఎన్ఐఏ, ఈడీలు సంయుక్తంగా దాడులు చేసి పీఎఫ్ఐ కీలక నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. వారివద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచడంతో పాటు ముస్లిం యువతను లష్కరే తోయిబా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రేరేపిస్తోందనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్, టర్కీ నుంచి నిధులను అక్రమంగా సేకరిస్తోందని విచారణలో తేలింది. దీంతో కేంద్రం పీఎఫ్ఐపై 5 ఏళ్లు నిషేధాన్ని విధించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అరెస్ట్ అయిన పీఎఫ్ఐ కార్యకర్తల నుంచి కీలక విషయాలను రాబట్టేపనిలో ఉంది ఎన్ఐఏ. ఇదిలా ఉంటే పీఎఫ్ఐ సంస్థపై పాన్ ఇండియా దాడుల తర్వాత తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల ఇళ్లపై పెట్రోల్ బాంబుదాడులు జరిగాయి. ఇక పీఎఫ్ఐకి మూలాలు బలంగా ఉన్న కేరళలో పీఎఫ్ఐ హర్తాళ్ కు పిలుపునిచ్చింది. పీఎఫ్ఐ కార్యకర్తలు కేరళలో హింసాత్మక దాడులకు పాల్పడ్డారు.

Read Also: Womens Asia Cup: రప్ఫాడించిన రోడ్రిగ్స్.. లంకపై భారత్ ఘనవిజయం

ఇదిలా ఉంటే కేరళకు చెందిన ఐదుగురు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్( ఆర్ఎస్ఎస్) నేతలకు కేంద్రం భద్రతను పెంచింది. పీఎఫ్ఐ గతం నుంచి వీరిపై నిఘా ఉంచడంతో ఏ సమయమైన దాడులు చేసే అవకాశం ఉందని కేరళకు చెందిన ఐదుగురు ఆర్ఎస్ఎస్ నేతలకు కేంద్రం ‘వై కేటగిరి’ భద్రతను కల్పిస్తున్నట్లు శనివారం వెల్లడించింది. ఇటీవల జరిగిన దాడుల్లో సెంట్రల్ ఏజెన్సీలు ఈ ఐదుగురు ఆర్ఎస్ఎస్ నేతలను పీఎఫ్ఐ టార్గెట్ చేస్తున్నట్లు గుర్తించింది. దీంతో సీఆర్పీఎఫ్ దళాలతో వీరికి వై కేటగిరి సెక్యూరిటీని కల్పించనున్నారు.

కేరళలో ఐదు రాష్ట్ర స్వయమ్సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నాయకులకు ఈ కేంద్రం వై వర్గం భద్రతా కవర్‌ను అందించినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి. ఈ వారం ప్రారంభంలో ఇస్లామిక్ సంస్థపై ఇటీవల అణిచివేసిన సందర్భంగా సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీలు ఈ కనెక్షన్లో పత్రాలను తిరిగి పొందిన తరువాత RSS నాయకుల పేర్లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) యొక్క రాడార్‌లో కనుగొనబడ్డాయి.