Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..

  • కేరళలో వివాదంగా ఇస్లామిక్ ఫ్రెండ్లీ జిమ్..
  • వ్యాయామానికి మతం రంగు అంటూ విమర్శలు..
  • విమర్శల నేపథ్యంలో ఓనర్ నవాజ్ క్లారిటీ..
Kerala

Kerala

Kerala: ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’, కేరళలో వివాదాస్పదంగా మారింది. పాలక్కాడ్‌కు చెందిన నవాజ్ ముత్తు టి ఈ పేరుతో ఒక జిమ్ ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేయడం వైరల్‌గా మారింది. అయితే, చాలా మంది దీనిని మతపరమైన కోణం ఉందని విమర్శిస్తున్నారు. అయితే, వివాదం పెద్దది కావడంతో ఓనర్ నవాజ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన జిమ్‌లో పెద్ద శబ్ధంతో మ్యూజిక్ ఉండదని, పురుషులు, ఆడవాళ్లకు వేర్వేరు సమయాలు, వేర్వేరు ప్రదేశాలు ఉంటాయని చెప్పారు. ట్రైనర్లు కూడా వేరుగా ఉంటారని వెల్లడించారు.

క్లారిటీ ఇచ్చిన నవాజ్:

నవాజ్ మాట్లాడుతూ.. ‘‘తాము ఇస్లాంకు అనుగుణంగా ఒక జిమ్ ప్రారంభిస్తున్నామని, కేరళలో ఇదే మొదటిది అవుతుందని, ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించాలి’’ అని ప్రచారం ప్రారంభించాడు. పేరుపై చాలా మంది విమర్శలు చేస్తున్న తరుణంలో, తన జిమ్ కొత్తది కాదని 15 ఏళ్లుగా నడుస్తున్న ఫిట్‌నెస్ సెంటర్ అని, ప్రస్తుతం దాన్ని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు.

×
×
Ad

ఇస్లామిక్-ఫ్రెండ్లీపై విమర్శలు:

అయితే, సోషల్ మీడియాలో దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించే ప్రయత్నంగా కొందరు చెబుతుండగా, మరికొందరు జిమ్‌లో మహిళల కోసం ప్రత్యేక ట్రైనర్లు, సమయాలు ఉండటం సౌకర్యవంతంగా ఉంటుందని అంటున్నారు. కొంత మంది దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తు్న్నారు. మతపరమైన గుర్తింపుతో జిమ్‌లను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్వించారు. ఫిట్ నెస్‌కు మతంతో ముడిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. దీని వల్ల సమాజంలో విభజన ఏర్పడుతుందని అన్నారు.

విమర్శలు ఎక్కువ కావడంతో నవాజ్ తన జిమ్ అన్ని మతాల వారికి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఇది కేవలం ముస్లిం కోసం మాత్రమే కాదని చెప్పారు. తాను ఇది ముస్లింల జిమ్ అని లేదా ముస్లిం కోసం మాత్రమే అని చెప్పడం లేదని తెలిపారు. ఇస్లామిక్ ఫ్రెండ్లీ అనేది కొన్ని పద్ధతుల్ని సూచిస్తుందని, అంతే కానీ వేరే మతాల వారు రావడంపై ఆంక్షలు ఉండవని చెప్పారు. స్త్రీలు, పురుషులు కలిసి వ్యాయామం చేయకుండా ప్రత్యేక ప్రాంతాలు ఉండాలని, సమయాలు వేరుగా ఉండాలని ఆయన అన్నారు.