Site icon NTV Telugu

తెరచుకున్న అయ్యప్ప ఆలయం.. 5 రోజులు ప్రత్యేక పూలు..

Sabarimala

Sabarimala

శబరిమలలోని అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. మలయాళ నెల కర్కిదకమ్‌ మాసపూజ సందర్భంగా ఆలయాన్ని తెరిచారు పూజారులు.. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఈ ప్రత్యేక పూజలకు భక్తులకు అనుమతి ఇచ్చినా.. కొన్ని షరతులు విధించారు.. నిన్న సాయంత్రం ఆలయాన్ని తెరిచిన పూజారులు.. ఇవాళ ఉదయం నుంచి భక్తులను అనుమతి ఇస్తున్నారు.. కరోనా భయాలు వెంటాడుతుండడంతో.. ముందుగానే బుక్‌ చేసుకున్న 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ఇవాళ్టి నుంచే భక్తులకు అనుమతి ఇస్తుండగా.. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి, ఇక, ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు.. 48 నుంచి 72 గంటల ముందు చేయించుకున్న కరోనా నిర్ధారణకు పరీక్షలకు సంబంధించిన నెగిటివ్‌ రిపోర్టు తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇక, ఈనెల 21వ తేదీ వరకూ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతి ఇవ్వనున్నారు.

Exit mobile version