Site icon NTV Telugu

Congress: ‘‘ఒకే దేశం-ఒకే భర్త’’ అంటూ కాంగ్రెస్ ట్వీట్.. బీజేపీ ఆగ్రహం..

Kerala Congress

Kerala Congress

Congress: ప్రధాని నరేంద్రమోడీని అవమానించే విధంగా కేరళ కాంగ్రెస్ యూనిట్ ‘‘ఒకే దేశం-ఒకే భర్త’’ అనే ట్యాగ్‌లైన్‌తో చేసిన ట్వీట్ రాష్ట్రంలో కొత్త వివాదానికి కారణమైంది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసియబడిన ఈ పోస్ట్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. కాంగ్రెస్ హిందూ ఆచారాలను టార్గెట్ చేస్తోంది, అగౌరవపరుస్తోందని, బుజ్జగింపు రాజకీయాల్లో పాల్గొంటోందని కేరళ బీజేపీ, కాంగ్రెస్‌ని తీవ్రంగా విమర్శించింది.

Read Also: Baloch Liberation Army: పాకిస్తాన్‌కి షాక్.. కీలకమైన నగరాన్ని చేజిక్కించుకున్న బీఎల్ఏ..

కేరళ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి ‘‘ఒకే దేశం, ఒకే భర్త’’అనే క్యాప్షన్‌తో పాటుఒక ఫోటోని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితంపై వ్యంగ్యంగా చేసినట్లు కనిపిస్తుంది. అయితే, ఈ పోస్ట్ హిందువుల మనోభావాలు కించపరిచేలా, అవమానకరంగా ఉందని బీజేపీ ఆరోపించింది. “ఈ ట్వీట్ కేవలం రాజకీయం కాదు – ఇది హిందూ ఆచారాలపై దాడి మరియు సిందూరం ధరించిన మహిళలను అవమానించదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళలోని లక్షలాది మంది మహిళలకు సిందూరం ఎంతో పవిత్రమైందని, వివాహం మరియు మహిళలకు చిహ్నం అని బీజేపీ తెలిపింది.

కాంగ్రెస్ చేసిన ట్వీట్ కాంగ్రెస్ లోని పీఎఫ్ఐ భావజాలాన్ని ప్రతిబింబిస్తోందని బీజేపీ విమర్శించింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ, క్రైస్తవ విశ్వాసాలపై కాంగ్రెస్ నిరంతరం దాడులు చేస్తోందని ఆరోపించింది. గతంలో శబరిమలను అపవిత్రం చేయడానికి కాంగ్రెస్, వామపక్షాలతో నిలిచిందని,వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలను ఆమోదించిందని బీజేపీ చెప్పింది.

Exit mobile version