Site icon NTV Telugu

Kerala: వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ తీర్మానం

Cmpinarayivijayan

Cmpinarayivijayan

వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 2024 వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేరళ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర హక్కులు, లౌకిక సూత్రాలను దెబ్బతీసేలా ఈ బిల్లు ఉందని కేబినెట్ మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ సవరణలను సూచించింది. కానీ తీర్మానానికి మద్దతు ఇచ్చింది. వక్ఫ్, హజ్ తీర్థయాత్ర మరియు క్రీడల మంత్రి వి అబ్దురహిమాన్ తీర్మానాన్ని సమర్పించారు. ఈ బిల్లు రాజ్యాంగంలో పొందుపరచబడిన సమాఖ్య సూత్రాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Darshan: దర్శన్ కి దెబ్బ మీద దెబ్బ!!

ఈ బిల్లు వక్ఫ్ విషయాలకు సంబంధించి రాష్ట్ర హక్కులను ఉల్లంఘిస్తుందని, వక్ఫ్ ఆస్తులను పర్యవేక్షించే బాధ్యత కలిగిన వక్ఫ్ బోర్డులు మరియు ట్రిబ్యునల్‌ల అధికారాన్ని సమర్థవంతంగా బలహీనపరుస్తుందని అబ్దురహిమాన్ తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక సూత్రాలను ఉల్లంఘించడమే కాకుండా ఎన్నికైన ప్రతినిధుల స్థానంలో నామినేటెడ్ సభ్యులు మరియు నామినేటెడ్ ఛైర్మన్‌ను నియమించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు ముప్పు కలిగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి:

ఇది కూడా చదవండి: Tirumala: తుఫాన్ ఎఫెక్ట్‌.. ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్‌ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత పలుమార్లు.. ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది. 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన సర్కార్.. మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్‌ బోర్డులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Kishan Reddy: రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు.. నవంబర్1 నుంచి బీజేపీ ఉద్యమ బాట..

Exit mobile version