Darshan: దర్శన్ కి దెబ్బ మీద దెబ్బ!!
- నటుడు దర్శన్‌కు మరోసారి చుక్కెదురు
- దర్శన్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన బెంగళూరు కోర్టు
- రేణుకాస్వామి హత్య కేసులో A2 నిందితుడిగా ఉన్న దర్శన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan bail plea gets rejected in Renukaswamy murder case after 4 months of arrest : తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ అయి నాలుగు నెలలు కావస్తోంది. పోలీసులు చార్జిషీట్ సమర్పించిన అనంతరం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆ కోరిక మాత్రం ఫలించడం లేదు. ఆయన బెయిల్ దరఖాస్తును విచారించిన బెంగళూరులోని 57వ సీసీహెచ్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో దర్శన్ జైల్లోనే కొనసాగడం అనివార్యమైంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దరఖాస్తు చేసుకునేందుకు దర్శన్ కి అవకాశం ఉంది. రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్ జూన్ 11న అరెస్టయ్యాడు. ఆ తర్వాత బెంగుళూరు సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే అక్కడ విలాసవంతమైన వసతి లభించినట్టు బయటకు రావడంతో బళ్లారి జైలుకు తరలించారు. ఇప్పుడు బెయిల్ పిటిషన్ కొట్టివేత కారణంగా బళ్లారి జైలులోనే ఉండాల్సి వచ్చింది.
Anchor Kavyasri: యాంకర్ పై వైసీపీ నాయకుడి దాడి?
Also Read
బెయిల్ రాకపోవడంతో దర్శన్ అనారోగ్య కారణాలతో బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది. దర్శన్ కుటుంబ సభ్యులు ఇప్పటికే మెడికల్ రిపోర్టును సిద్ధం చేశారు. అనారోగ్యం కారణంగా బెంగుళూరుకు షిఫ్ట్ అయ్యేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దర్శన్ గత కొన్ని రోజులుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. దర్శన్ తరపున కోర్టులో సివి నగేష్ వాదించారు. దర్శన్‌కు వ్యతిరేకంగా సాక్షులు కల్పితమని నగేష్ వాదించారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ప్రసన్నకుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రసన్నకుమార్ వాదన న్యాయమూర్తికి సమంజసంగా అనిపించడంతో దర్శన్‌కు బెయిల్ నిరాకరించింది. దీంతో దర్శన్ కుటుంబం, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బెయిల్ కోరుతూ దర్శన్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించడం ఒక ఆప్షన్ కాగా అనారోగ్యం కారణంగా 57వ సీసీహెచ్ కోర్టులో మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం మరో ఆప్షన్ అని అంటున్నారు. ఇక ఆయన జైలు నుంచి విడుదలవుతారనే ఆశతో వందలాది మంది అభిమానులు తరలివచ్చారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!