Site icon NTV Telugu

Kejriwal: ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుంది

Kejeoi

Kejeoi

ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ఆరోపించారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో కమలం పార్టీపై కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుందని ఆరోపించారు.

ఢిల్లీ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. బీజేపీ నిజ స్వరూపాన్ని భగవంతుడే ప్రజల ముందు ఉంచాడని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ గెలవదనే ఘటన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక నిరూపించిందని తెలిపారు.

ఎమ్మెల్యేలకు ఎరవేయడం, ప్రభుత్వాలను బహిరంగంగా కూల్చివేసే ప్రయత్నాలకు బీజేపీ పాల్పడుతోందని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతోన్న రైతుల ఆందోళనలపై (Farmers protest) స్పందించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రైతులను నగరంలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించకపోవడమే కాక వారి సమస్యలు కూడా వినడం లేదని కేజ్రీవాల్ విమర్శించారు.

కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలపై..
ఢిల్లీలో కాంగ్రెస్‌కు సీట్ల పంపకాలపై కేజ్రీవాల్ స్పందించారు. 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందని ఆయన మీడియాకు తెలియజేశారు.

ఇండియా కూటమిలో ఆప్ భాగస్వామ్యంగా ఉంది. ఇప్పటికే పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. అయితే ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తామని ఇప్పటికే తెలిపింది. మరీ కాంగ్రెస్‌కు ఆప్ ఎన్ని సీట్లు ఇస్తుందో వేచి చూడాలి.

Exit mobile version