Kejriwal: దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయి.. డీలిమిటేషన్ ప్రజాస్వామ్యంపై దాడి అన్న కేజ్రీవాల్
- దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతున్నాయి
- డీలిమిటేషన్ ప్రజాస్వామ్యంపై దాడి
- ఢిల్లీ హైకోర్టు పిటిషన్ కొట్టివేతపై స్పందించిన కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది రాష్ట్రాలకు వివక్షకు గురవుతున్నాయని ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. డీఎంకేకు మద్దతుగా తమిళనాడులో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ… డీలిమిటేషన్ బిల్లు ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. అందుకే ఆ బిల్లును వ్యతిరేకించినట్లుగా చెప్పారు. ఈ విషయంలో విపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ చాలా మంచి పని చేస్తున్నారని భావిస్తున్నానన్నారు. మంచి పని చేస్తే ఎవరికైనా మద్దతు ఇవ్వాలని తెలిపారు. తమిళనాడులో బీజేపీ ఉనికే లేదని.. ఆ పార్టీకి ఎవరూ మద్దతు ఇవ్వొద్దని కోరారు.
లిక్కర్ కేసు..
ఢిల్లీ లిక్కర్ కేసులో జస్టిస్ స్వర్ణ కాంత శర్మను తొలగించాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ అంశంపై తొలిసారి కేజ్రీవాల్ స్పందించారు. ‘‘నిన్నటి నుంచి తమిళనాడులోనే ఉన్నాను. నేను తిరిగి వెళ్లాక ఉత్తర్వును క్షుణ్ణంగా చదవాలి. నేను కోర్టులో నా వాదనలు వినిపించాను. ఇంతకు మంచి ఏమీ వ్యాఖ్యానించలేను.’’ అని అన్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
ఢిల్లీ లిక్కర్ కేసును ఫిబ్రవరి 27న ట్రయల్ కోర్టు కొట్టేసింది. అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణ కాంత శర్మ విచారిస్తున్నారు. అయితే ఆమెపై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. జస్టిస్ శర్మ ఆర్ఎస్ఎస్ భావజాలు కలిగిన వారని.. ఈ కేసులో న్యాయం చేస్తారని అనుకోలేమన్నారు. ఈ కేసు నుంచి ఆమెను తప్పించాలని పిటిషన్ వేశారు. సోమవారం ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.
#WATCH | Chennai | AAP National Convenor, Arvind Kejriwal says, "We are all together in opposing the delimitation bill as it is an assault on democracy and we strongly oppose it. The Southern states would be discriminated… I think he (MK Stalin) is doing very good work, and… pic.twitter.com/61QuTmoFc0
— ANI (@ANI) April 21, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?