Kedarnath Temple: కేదార్నాథ్ ఆలయం మూసివేత.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తుల రాక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kedarnath Temple: ప్రముఖ శైవ క్షేత్రం కేదార్నాథ్ ఆలయ ద్వారాలను శీతాకాలం సందర్భంగా మూసివేశారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న బాబా కేదార్నాథ్ ఆలయాన్ని ఈ రోజు అనగా.. నవంబర్ 11న ఉదయం 8:30 గంటలకు సంప్రదాయబద్ధంగా మూసివేశారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి ‘జై బాబా కేదార్’ నినాదాలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. దీంతో ఈ ఏడాది కేదార్నాథ్ యాత్ర ముగిసింది. ఆలయ ద్వారాల మూసివేతకు సంబంధించిన కార్యక్రమాలు తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక ఘట్టాన్ని వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం ఉదయం 8:30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. దీంతో ఈ ఏడాదికి భక్తులకు ప్రత్యక్ష దర్శనాలు నిలిచిపోయాయి. సంప్రదాయ ఆచారాల ప్రకారం స్వయంభువుగా వెలసిన బాబా కేదార్ శివలింగాన్ని శీతాకాలం కోసం సమర్పించే ప్రక్రియ కూడా పూర్తయింది.
శీతాకాలంలో మరోచోట బాబా కేదార్‌కు పూజలు
అయితే, ప్రతి సంవత్సరం శీతాకాలంలో భారీగా మంచు కురవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మూసివేస్తారు. ఆలయ ద్వారాలు మూసివేసినప్పటికీ బాబా కేదార్ ఆరాధన మాత్రం కొనసాగుతుంది. సంప్రదాయం ప్రకారం బాబా ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా శీతాకాల విడిది అయిన ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలిస్తారు. అక్కడే శీతాకాలమంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తులు అక్కడికి వెళ్లి బాబా కేదార్‌ను దర్శించుకోవచ్చు.
Also Read
- Kolkata-Sairang Express Derails: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్..
- Tripura Civic Polls 2026: త్రిపుర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా.. పోటీ లేకుండానే 77 స్థానాలు కైవసం!
- Sonia Gandhi: సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం వాళ్లే.. సంచలన విషయాలు వెలుగులోకి..
- Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
చివరి రోజు భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
ఆలయ ద్వారాలు మూసివేయడానికి ముందు రోజు నుంచే కేదార్‌నాథ్‌లో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. చివరి సాయంకాల హారతి సమయంలో గంటల నాదం, మంత్రోచ్ఛారణలు, శివనామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ ఏడాదికి చివరిసారిగా బాబా కేదార్‌ను దర్శించుకుని భక్తులు భావోద్వేగానికి గురయ్యారు.
ఈ ఏడాది 19,22,138 మంది భక్తుల దర్శనం
వాతావరణ పరిస్థితులు, ప్రయాణ మార్గాల్లో సవాళ్లు ఎదురైనప్పటికీ కేదార్నాథ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 19,22,138 మంది భక్తులు ఈ ఏడాది బాబా కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ, ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేశాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమిస్తూ ఇంత భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడం కేదార్‌నాథ్‌పై ప్రజలకు ఉన్న అపారమైన భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుతం ఆలయ ద్వారాలు మూసివేయడంతో సాధారణ దర్శనాలు, ఆలయంలో జరిగే పూజలు నిలిచిపోయాయి. అయితే శీతాకాల విడిది కేంద్రంలో బాబా కేదార్‌కు నిత్య పూజలు కొనసాగనున్నాయి. వచ్చే యాత్రా సీజన్లో ఆలయ ద్వారాలు తిరిగి తెరుచుకునే వరకు భక్తులు ఎదురుచూడనున్నారు.
తాజావార్తలు
-
Ramayana: ఆస్కార్ రేసులో ‘రామాయణ: పార్ట్ 1’.. ఇండిపెండెంట్ ఎంట్రీ!
-
Kedarnath Temple: కేదార్నాథ్ ఆలయం మూసివేత.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తుల రాక!
-
Kolkata-Sairang Express Derails: రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్..
-
Suryakumar Yadav: భార్య ఇచ్చిన సలహా తన ఆలోచనా విధానాన్ని మార్చేసింది.. జట్టులో స్థానం కోల్పవడంపై ఓపెనైన స్కై..!
-
Alcohol Sales: అమెరికా, చైనాను మించి భారతీయులే అతిపెద్ద తాగుబోతులు!
ట్రెండింగ్
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు