KCR: 2004 నుంచి ఆ ఇళ్లే కేసీఆర్ అధికారిక నివాసం.. బీఆర్ఎస్ ఓటమితో ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: రెండు దశాబ్దాలుగా దేశ రాజధాని ఢిల్లీలో కేసీఆర్ అధికారిక నివాసంగా ఉన్న తుగ్లక్ రోడ్డులోని 3వ నెంబరు ఇంటిని ఖాళీ చేస్తున్నారు. ఢిల్లీలోని తన అధికార నివాసంతో మాజీ సీఎం కేసీఆర్ 20 ఏళ్ల అనుబంధానికి తెరపడింది. 2004 నుండి ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లోని ఇల్లు అప్పట్లో కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పటి నుండి అధికారిక నివాసంగా ఉంది. ఆ తర్వాత సీఎంగా ఉన్న సమయంలో ఆ ఇంటిని అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హస్తినలోని కేసీఆర్ అధికారిక నివాసాన్ని సిబ్బంది ఖాళీ చేస్తున్నారు.
అయితే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతున్న సమయంలో కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారిక భవనాలను ఖాళీ చేయాల్సిందే. ఇప్పటికే పలువురు మంత్రులు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారిక భవనాలను ఖాళీ చేస్తున్నారు. క్యాంపు కార్యాలయాల్లోనే తమ సామాగ్రిని తరలిస్తున్నారు. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను కూడా కేసీఆర్ ఖాళీ చేయాల్సిందే. ఇప్పటికే ఆయన ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌కి వెళ్లారు. ప్రస్తుతం అక్కడి నుంచే పార్టీ కలాపాలు చూసుకుంటున్నారు.
Also Read
- Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
- PM Modi: న్యూజిలాండ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్‌ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
Read also: Cyclone Michuang Updates: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. వేలాది ఎకరాల్లో పంట నష్టం!
రాష్ట్రంలో గెలిచిన తర్వాత కేసీఆర్ రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎం హోదాలో హస్తినకు వచ్చినప్పుడల్లా ఈ ఇంట్లోనే ఉండేవారు. అధికారం కోల్పోయిన ఏ ప్రజాప్రతినిధి అయినా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి ఒక నెల సమయం ఉంటుంది. కానీ, కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు మూడు రోజుల్లో ఇల్లు పూర్తిగా ఖాళీ చేయనున్నారు. ఆ ఇల్లు ఖాళీగా ఉంటే రెండు దశాబ్దాలుగా ఈ ఇంటితో కేసీఆర్‌కు ఉన్న సంబంధం తెగిపోతుంది. 2004లో టీఆర్ఎస్ తరఫున కరీంనగర్ నుంచి ఎంపీగా ఎన్నికై మన్మోహన్సింగ్ కేబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ పనిచేశారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు తుగ్లక్ రోడ్డులోని టైప్ 8 క్వార్టర్‌ను కేటాయించింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచి అదే సభలో కొనసాగారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన అదే నివాసంలో ఉంటున్నారు.
2014లో తెలంగాణ సీఎం అయిన కేసీఆర్.. ముఖ్యమంత్రులకు ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా అదే నివాసాన్ని కేసీఆర్ కు కేటాయించారు. అదే సమయంలో కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఆమె ఆ నివాసాన్ని తన అధికారిక నివాసంగా కూడా ఎంచుకుంది. ఆ క్వార్టర్ ముఖ్యమంత్రి, ఎంపీ కవితకు అధికారిక నివాసంగా మారింది. 2018లో కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత అదే నివాసంలో కొనసాగారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కవితకు ప్రస్తుతం ఎంపీ పదవి కూడా లేదు. దీంతో ఢిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇల్లు ఖాళీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా రెండు మూడు రోజులు పడుతుందని బీఆర్ఎస్ వర్గాలు కేంద్ర ప్రభుత్వ అధికారులకు నివేదించినట్లు సమాచారం.
Dinesh Phadnis Passes Away: సీఐడీ ఫేమ్ నటుడు దినేష్ ఫడ్నిస్ కన్నుమూత
తాజావార్తలు
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
-
Kerala: విషాదం.. పెదవి గాయానికి ఆస్పత్రికి వెళ్తే, చిన్నారి ప్రాణమే పోయింది..
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!