Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
- ప్యూర్టో రికోకు కజియా పయనం
- మెరూన్ చీరలో ప్రత్యేక ఆకర్షణ
- 19 ఏళ్లకే అందాల కిరీటం
- ప్రపంచ వేదికపై భారత్ ఆశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందాల భామల ప్రపంచంలో భారత్ తలమానికంగా నిలిచేందుకు మరో అరుదైన వేళ ఆసన్నమైంది. గత ఆగస్టులో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్న కేరళకు చెందిన 19 ఏళ్ల వయసు అందాల తార కజియా లిజ్ మేజో.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ వేదికపై తలపడేందుకు విమానం ఎక్కేసారు. ప్రతిష్టాత్మక 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో మన దేశం తరఫున త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడానికి ప్యూర్టో రికోకు బయలుదేరిన ఈ ముద్దుగుమ్మకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు నీరాజనాలు పట్టారు. దేశం మొత్తం గర్వపడేలా గ్లోబల్ స్టేజ్‌పై సత్తా చాటేందుకు ఆమె అడుగుపెడుతున్న తీరు యువతలో అంతులేని ఉత్సాహాన్ని నింపుతోంది.
సాంప్రదాయం ఉట్టిపడేలా మెరూన్ చీరలో అప్సరసలా..
అంతర్జాతీయ వేదికపై అడుగుపెడుతున్న వేళ కజియా ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ డిజైనర్ సమంత్ చౌహాన్ తీర్చిదిద్దిన ముదురు ఎరుపు (డీప్ మెరూన్) రంగు చీరలో ఆమె రాజసంగా కనిపించారు. చీరపై మెరిసే బంగారు దారపు కుట్లు, అప్లిక్ డిజైన్లు ఆమె అందాన్ని మరింత ఇనుమడింపజేశాయి. తలపై మిస్ యూనివర్స్ ఇండియా కిరీటంతో, మెడలో అందమైన చోకర్‌తో ఆమె ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వస్తున్న తీరు చూసేవారికి కనువిందు చేసింది. విమానాశ్రయంలో ఆమెను చూసేందుకు గుమిగూడిన అభిమానులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ఉత్సాహంగా ముందుకు కదిలారు.
Also Read
- Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
- OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
- Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
- Train Fire Accident: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదు బోగీలకు మంటలు!
లా చదువుతూనే కిరీటాన్ని కైవసం చేసుకున్న మల్టీటాలెంటెడ్ బ్యూటీ
కేవలం పంతొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఇంతటి ఘనత సాధించడం సాధారణ విషయం కాదు. మోడలింగ్ రంగంలో దూసుకుపోతూనే, మరోవైపు లా (న్యాయశాస్త్రం) చదువును కొనసాగిస్తున్న అంకితభావం ఆమె సొంతం. చదువుతో పాటు మంచి శాస్త్రీయ నర్తకిగా, అద్భుతమైన వక్తగా, నటిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారు. గతంలో ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’ పోటీల్లోనూ భారతదేశానికి రన్నరప్ నిలిచి సత్తా చాటిన కజియా.. ఇప్పుడు ఏకంగా ప్రపంచ సుందరి కిరీటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. జైపూర్‌లో జరిగిన హోరాహోరీ పోటీల్లో వేలాది మందిని వెనక్కి నెట్టి కిరీటాన్ని దక్కించుకున్న ఆమె, ఇప్పుడు ప్యూర్టో రికో గడ్డపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
తాజావార్తలు
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!