Kavita Media Conference: మధ్యాహ్నం మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత.. సర్వత్రా ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha Letter To ED: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై ఇప్పుడు హాట్ టాపిక్. ఢిల్లీ ఈడీ కార్యాలనికి రావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈనేపథ్యంలో కవిత ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సంచలంగా మారింది.
లేఖలో ఏముందంటే..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటని ఈడికి ఎమ్మెల్సీ కవిత లేఖరాశారు. తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె ఈడి జాయింట్ డైరెక్టర్ కు లేఖ రాశారు. ముందస్తు అపాయింట్మెంట్లు, కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేయని తేల్చి చెప్పారు కవిత. హడావిడిగా దర్యాప్తు చేయడం ఏంటని ఈడిని కవిత నిలదీశారు. ఇంత స్వల్ప కాలంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ఏంటో అర్థం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు పేరిట రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేది ఏమీ లేదని తెలిపారు. ఒక సామాజిక కార్యకర్తగా ఒక వారం ముందే నా కార్యక్రమాలు ఖరారయ్యాయనీ, కాబట్టి 11వ తేదీన విచారణకు హాజరవుతానని తెలియజేశారు.
రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. దేశ పౌరురాలిగా ఒక మహిళగా చట్టపరమైనటువంటి అన్ని హక్కులను తాను ఉపయోగించుకుంటానని తేల్చి చెప్పారు. గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక మహిళను తన నివాసంలో విచారించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. వీటన్నింటినీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని అడిగారు. ఈనేపథ్యంలో..
మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రేపు జంతర్ మంతర్ ధర్నా, ఈడి నోటీసుపై కవిత స్పందించనున్నట్లు సమాచారం. ముందస్తు బెయిల్ కోసం BRS లీగల్ సెల్ చర్చలు జరుగుతున్నాయని టాక్. అయితే వీటన్నింటిపై క్లారిటీ కోసం మధ్యాహ్నం కవిత మీడియా సమావేశంపై వైట్ చేయాల్సిందే. దీంతో కవిత మీడియా సమావేశంలో ఏం చెప్పనున్నారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
Astrology: మార్చి 09, గురువారం దినఫలాలు
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!