MLC Kavitha: ఇవాళ కవిత లిక్కర్ సీబిఐ కేసు విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా విచారణ జరపనున్నారు. సీబీఐ కేసులో కవితపై దాఖలు చేసిన చార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంతో పాటూ, సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్ పై రౌస్ ఎవిన్యూ కోర్టు విచారణ జరపనున్నారు. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ విచారణ జరపనుంది. గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి కావేరి బవెజా ఆదేశించిన విషయం తెలిసిందే… ఈ నేపథ్యంలో జూలై 8న ట్రయల్ కోర్టులో కవిత సీబీఐ కేసు విచారణ జరిగింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై వేసిన ఛార్జ్ షీట్ ను కవిత తరపు న్యాయవాది తప్పుపట్టారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. వాదనలు విన్న జడ్జి కావేరి బవెజా ఇవాల్టికి పిటిషన్ ను వాయిదా వేశారు.
Read also: Delhi Liquor Case: నేడు కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు..
కాగా, మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న అరెస్టు చేశారు. తీహార్ జైలులో ఉన్న కవితను ఇదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే మద్యం కేసులో కవిత పాత్ర ఉందంటూ సీబీఐ పలు ఆధారాలతో ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కవిత ప్రమేయంపై నేడు విచారణ జరగనుంది. కాగా, ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ కోరుతుండగా.. బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తోంది. మధ్యంతర బెయిల్ కోసం కవిత తరఫు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాత్కాలిక బెయిల్ కోసం కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Gujarat : ఇంటర్వ్యూ ఎగబడ్డ యువత భరూచ్‌లోని హోటల్లో తొక్కిసలాట