Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- జమ్మూకశ్మీర్ కథువాలో CISF క్యాంపులో కాల్పులు
- సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద ఘటన
- సహచరులపై కాల్పులు జరిపిన హెడ్ కానిస్టేబుల్
- ఈ ఘటనలో నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలోని బసోలిలోని CISF క్యాంపులో సైనికుడు తన తోటి సైనికులపై కాల్పులు జరపడంతో నలుగురు సైనికులు మరణించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం విచారణకు ఆదేశించింది. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఘటనను పర్యవేక్షిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం 7.10 గంటలకు ఈ ఘటన జరిగింది. వెంటనే కథువా జిల్లా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్న క్యాంపులో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో, హిమాచల్‌లోని చంబా జిల్లాకు ఆనుకుని ఉంది. హెడ్ కానిస్టేబుల్ అవధేష్ కుమార్ సింగ్ తన వద్ద ఉన్న ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్-ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుళ్లు రఫీక్ అహ్మద్, సందీప్ కుమార్‌గా గుర్తించారు. నలుగురినీ చికిత్స కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని NHPC ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.
Also Read
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
Four Central Industrial Security Force (CISF) personnel were shot dead by a 2009-batch Head Constable of the force following a verbal argument among them over an issue at the Sewa-II Hydroelectric Project unit in Kathua. The incident took place around 7 pm. The accused Head…
— ANI (@ANI) September 29, 2026
తాజావార్తలు
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!