Karur Stampede: ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక తీర్పు.. కరూర్ బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karur Stampede: కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఉపశమనం కల్పించేందుకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయిస్తే దానిని ప్రశ్నించడం ఎలా సాధ్యమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది.
తొక్కిసలాటలో 41 మంది మృతి
గత ఏడాది సెప్టెంబర్‌లో విజయ్ పాల్గొన్న టీవీకే ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు పలు అంశాలను ప్రస్తావించారు. విజయ్ ఆలస్యంగా రావడంతో జనసందోహం అనుమతించిన సామర్థ్యాన్ని మించిపోయిందని, తాగునీరు, ఆహారం, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు తగినంతగా లేవని పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీవీకే ఖండించింది. పోలీసుల వైఫల్యమే ఘటనకు కారణమని పార్టీ ఆరోపించింది. మాజీ డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీపై కూడా టీవీకే పలు ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను సెంథిల్ బాలాజీ ఖండించారు.
Also Read
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
- Supreme Court: "ఆంక్షలు విధించడానికి మీరెవరు?".. నల్సార్ లా వర్సిటీ అంశంలో BCIకి సుప్రీంకోర్టు చురకలు..
ఉద్యోగాలపై మద్రాస్ హైకోర్టు అభ్యంతరం
తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు జూలై 27న రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల హక్కును కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 16కు ఈ నిర్ణయం విరుద్ధంగా ఉందని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి ప్రత్యేక నియామకాలకు అనుమతి ఇస్తే భవిష్యత్తులో మరింత మంది ఇలాంటి ఉద్యోగాలను కోరే అవకాశం ఉందని, దీనివల్ల ‘ఫ్లడ్‌గేట్స్’ తెరుచుకునే పరిస్థితి ఏర్పడుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం.. తొక్కిసలాట జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రభుత్వం వారికి కొంత ఉపశమనం కల్పించాలని నిర్ణయిస్తే, డబ్బుతో పాటు ఉద్యోగం ఇవ్వడాన్ని ఎలా ప్రశ్నించగలమని వ్యాఖ్యానించింది. ఒక కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి ఈ ఘటనలో మరణిస్తే.. అతని కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకూడదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది.
32 మంది వారసులకు ఇప్పటికే ఉద్యోగాలు
తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఉపశమనం, పునరావాస చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. జూలైలో బాధితుల 32 మంది చట్టబద్ధ వారసులకు కారుణ్య నియామక ఉత్తర్వులను అందజేసినట్లు సమాచారం. ఈ నియామకాల ఉద్దేశం విషాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమేనని ప్రభుత్వం పేర్కొంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో బాధిత కుటుంబాలకు ఉద్యోగాల కల్పన అంశంలో మరోసారి ఊరట లభించినట్లైంది. అయితే ఈ నియామకాలపై తుది న్యాయపరమైన నిర్ణయం వెలువడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
IND vs SL: తొలి టెస్టు టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్.. సీనియర్‌కు నో ప్లేస్, కొత్త కుర్రాడు అరంగేట్రం!
-
Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Karur Stampede: ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక తీర్పు.. కరూర్ బాధితులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
ట్రెండింగ్
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!